Tanikella Bharani Says He Received Threas Calls Him from Women - Sakshi
Sakshi News home page

Tanikella Bharani : 'అది చూసి చంపేస్తామని బెదిరింపు కాల్స్‌ వచ్చాయి'

Jan 8 2022 6:20 PM | Updated on Jan 8 2022 7:23 PM

Tanikella Bharani Says He Received Threat Calls From Women - Sakshi

తనికెళ్ల భరణి.. నటుడిగా, రచయితగా తెలుగువారందరికీ సుపరిచితమే. తన విలక్షణమైన నటనతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న ఆయన నిజ జీవితంలోబెదిరింపులను సైతం ఎదుర్కొన్నాడట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఈ విషయాలను వెల్లడించాడు. ఊహ సినిమాలో కీలక పాత్ర పోషించిన తనికెళ్ల భరణి.. ఆ సినిమాలో కాస్త విలనిజం కనబరుస్తాడు. భర్త చనిపోయిన మరదలిపై కన్నేసిన ఊహ బావ పాత్రలో తనికెళ్ల నటించిన సంగతి తెలిసిందే.

అయితే ఆయన నటనకు ఎంత గుర్తింపు వచ్చిందో అదే స్థాయిలో బెదిరింపులు కూడా వచ్చాయట. ఆ సినిమా అనంతరం కొందరు మహిళలు తనను చంపేస్తామంటూ బెదిరించారు.  అది నిజం కాదు.. కేవలం నటన మాత్రమే అని చెప్పినా కొందరు వినిపించుకునేవాళ్లు కాదు. నటన అంటే ప్రేక్షకులు అంతలా మమేకమైపోతారు అంటూ చెప్పుకొచ్చారు. 


 

Advertisement
 
Advertisement
Advertisement