అజిత్ ఇంటికి సీఎం విజయ్, త్రిష.. వీడియో వైరల్..! | Tamilnadu CM Vijay And Trisha Krishnan Condolences To Ajith Kumar Mother Demise, Watch Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

Ajith Kumar: అజిత్ ఇంటికి సీఎం విజయ్, త్రిష.. వీడియో వైరల్..!

May 31 2026 10:29 AM | Updated on May 31 2026 11:18 AM

Tamilnadu CM Vijay Condolences To Ajith Kumar Mother Demise

కోలీవుడ్ హీరో అజిత్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఈ వార్తలో అజిత్ అభిమానులు, కోలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. దుబాయ్‌లో ఉన్న అజిత్ వెంటనే చెన్నై చేరుకున్నారు. ఆమె కడచూపు కోసం అభిమానులు పెద్దఎత్తున అజిత్ ఇంటికి వచ్చారు.

తమిళనాడు సీఎం విజయ్ కూడా అజిత్ తల్లి మోహిని పార్ధివదేహానికి నివాళులర్పించారు. దండ చేతిలో పట్టుకుని నేరుగా అజిత్ ఇంటికి వెళ్లిన విజయ్‌.. అక్కడే ఉన్న అజిత్‌ను ఓదార్చారు. సీఎంతో పాటు హీరోయిన్ త్రిష కూడా ఆమె భౌతికకాయానికి నివాళి అర్పించారు.  సీఎం విజయ్‌తో పాటే త్రిష కూడా వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement