Director Swaroop RSJ About Mishan Impossible - Sakshi
Sakshi News home page

Swaroop RSJ: దావూద్‌ ఇబ్రహీంకు, ఆర్జీవీకి చాలా పోలికలు.. డైరెక్టర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Published Sat, Mar 26 2022 7:44 PM | Last Updated on Sun, Mar 27 2022 9:06 AM

Swaroop RSJ About Mishan Impossible Movie - Sakshi

'ఏ కథ రాసినా  కామెడీ, థ్రిల్లర్, డ్రామా వుండేలా చూసుకుంటాను. తెలుగులో `చంటబ్బాయ్` తర్వాత డిటెక్టివ్ సినిమాలు పెద్దగా రాలేదు. లిటిల్ సోల్జర్స్ తర్వాత పిల్లలతో సినిమా రాలేదు. అందుకే వాటికి తగ్గట్టుగా రాసుకుని తీసిన సినిమానే మిషన్ ఇంపాజిబుల్' అని దర్శకుడు `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` ఫేమ్ స్వరూప్ ఆర్.ఎస్.జె. తెలియజేశారు. 

తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `మిషన్ ఇంపాజిబుల్`. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా శనివారంనాడు చిత్ర దర్శకుడు స్వరూప్ ఆర్.ఎస్.జె మీడియా సమావేశంలో పలు విషయాలు వెల్లడించారు. 

మిషన్ ఇంపాజిబుల్ అనే కథ 2014లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రాసుకున్నా. దావూద్ ఇబ్రహం అనే వ్యక్తిని పట్టుకుంటే డబ్బులు ఇస్తామని పేపర్‌లో వచ్చిన ప్రకటన చూసిన  పాట్నాకు చెందిన ముగ్గురు పిల్లలు ముంబై వెళ్ళిపోతారు. ఈ వార్తను కథగా రాసుకున్నాను. కానీ ఆ తర్వాత ఏజెంట్.. కథ డెవలప్ అవ్వడంతో ముందుగా దాన్ని ప్రారంభించా.

రెండవ సినిమా ఇలాంటి కథతో రావడం రిస్క్ అనుకోలేదు. నిజాయితీగా కథ చెబితే ప్రేక్షకులు చూస్తారనే పూర్తి నమ్మకం నాకుంది. ఏజెంట్.. సినిమాతో అది నిజమైంది. నా స్నేహితులు కూడా మొదటి సినిమా లవ్, కామెడీ చేయమన్నారు. కానీ నా తరహాలో నిజాయితీగా చెబితే చూస్తారనే డిటెక్టివ్ సినిమా తీశా.

మిషన్ ఇంపాజిబుల్ సినిమాలో మొదట ఎవరైనా హీరోతో చేద్దామనుకున్నాం. కానీ అప్పటికే `ఏజెంట్..` సినిమా చేశాం కదా అని ఫిమేల్ పాత్ర పెట్టాం. తాప్సీ చేసిన `తప్పడ్`, `పింక్` సినిమాలు స్ట్రాంగ్ మహిళా పాత్రలు పోషించింది. అందులోనూ తెలుగులో తను నటించి చాలా కాలం అయింది. ఆమెకు కథ చెప్పాను. తన కేరెక్టర్ చిన్నదైనా కథ నచ్చిందని సినిమా చేయడానికి ఒప్పుకుంది. తను ప్రొఫెషనల్ యాక్టర్. ముందురోజే డైలాగులు తీసుకుని ప్రిపేర్ అయ్యేది. ఆరు గంటలకల్లా సెట్‌కు వచ్చే వారు. 

ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. పిల్లలో ఒకరు దావూద్ ఫొటో చూసి రామ్‌ గోపాల్‌ వర్మ అనుకుంటాడు. నేను చిన్నప్పుడు అలానే అనుకునేవాడిని. నాలాగే ఎంతోమంది అలా అనుకున్నారు. ఎందుకంటే ఇద్దరికీ చాలా పోలికలుంటాయి. అందుకే  ట్రైలర్లో చూపించాను. 

టైటిల్ ఆంగ్లంలో `మిషన్..` అనేది పెట్టడానికి కారణం కూడా పిల్లలు స్పెల్లింగ్ తప్పుగా రాస్తారు. అందుకే అలా పెట్టాం. సినిమా చూస్తే అర్థమవుతుంది.

షూటింగ్ ను మన నేటివిటీకి తగినట్లుగానే తీశాం. హైదరాబాద్ చుట్టుపక్కల ఎనిమిది గ్రామాలలో షూట్ చేశాం.

కొత్తగా ఎటువంటి సినిమాలు కమిట్ కాలేదు. ఏజెంట్...కు సీక్వెల్ తీయాలనుకున్నాం. కాని దానికి మించి వుండాలి. అందుకే సమయం తీసుకుని చేయాలనుంది. ఏజెంట్.. ను హిందీలో తీయాల్సి వస్తే పూర్తి నేటివిటీ మార్చి తీయాలి. దానికి నేను దర్శకత్వం వహించను అని అన్నారు.

చదవండి: తను చనిపోయినట్లు వచ్చిన వార్తలపై నటుడి ఆగ్రహం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement