మరో భారీ బడ్జెట్‌ మూవీ నుంచి తప్పుకున్న స్టార్‌ హీరో సూర్య? | Suriya Vaadivaasal With Vetrimaaran Shelved Here Is The Truth | Sakshi
Sakshi News home page

Suriya : మరో భారీ బడ్జెట్‌ మూవీ నుంచి తప్పుకున్న స్టార్‌ హీరో సూర్య?

Published Sun, Dec 25 2022 1:54 PM | Last Updated on Sun, Dec 25 2022 1:54 PM

Suriya Vaadivaasal With Vetrimaaran Shelved Here Is The Truth - Sakshi

వైవిధ్యభరిత కథా చిత్రాలకు కేరాఫ్‌గా మారిన నటుడు సూర్య. ఇటీవల సూరరై పోట్రు, జై భీమ్‌ వంటి చిత్రాలతో మంచి హిట్లు అందుకున్నారు. ప్రస్తుతం శివ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఇది ఆయనకు 42వ చిత్రం. దీన్ని సూర్యనే తన 2డి ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై నిర్మించడం విశేషం. బాలీవుడ్‌ బ్యటీ దిశా పటాని నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షటింగ్‌ జరుపుకుంటోంది. కాగా, ఈ చిత్రానికి ముందే బాలా దర్శకత్వంలో సూర్య వణంగాన్‌ అనే చిత్రంలో నటించడం మొదలెట్టారు. దీనికి తనే నిర్మాత.

వీరి కాంబినేషన్‌లో ఇంతకుముందు నందా, పితామగన్‌ వంటి చిత్రాలు వచ్చి మంచి విజయాలు సాధించాయి. దీంతో వణంగాన్‌ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాంటిది విభేదాల కారణంగా వణంగాన్‌ చిత్రం నుంచి సూర్య వైదొలిగారు. కాగా, సూర్య కథానాయకుడిగా నటిస్తున్న మరో చిత్రం వాడివాసల్‌. వెట్రివరన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కలైపులి ఎస్‌.ధాను నిర్మిస్తున్నారు. ఇది జల్లికట్టు నేపథ్యంలో సాగే చిత్రం. కాగా ప్రస్తుతం దర్శకుడు వెట్రిమారన్‌ హాస్య నటుడు సరిని కథానాయకుడిగా పరిచయం చేస్త విడుదలై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నటుడు విజయ్‌ సేతుపతి కూడా ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.

ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత సూర్య హీరోగా నటిస్తున్న వాడివాసల్‌ చిత్రంపై వెట్రివన్‌ దృష్టి సారిస్తారని సమాచారం. అలాంటిది తాజాగా వణంగాన్‌ చిత్రం మాదిరిగానే వాడివాసల్‌ నుంచీ సూర్య వైదొలగిన వదంతులు సావజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. దీనిపై స్పందించిన నిర్మాత కలైపులి ఎస్‌.ధాను వాడివాసల్‌ చిత్రం గురిం జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. ఈ చిత్రానికి సంబంధింన ఫ్రీ ప్రొడక్షన్స్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement