సూర్య కరుప్పు.. వారం రోజుల్లోనే అరుదైన మార్క్..! | Suriya Karuppu Movie Smashes Rs 200 Crore Globally In First Week Of Box Office Collections, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

karuppu Collections: సూర్య కరుప్పు.. వారం రోజుల్లోనే అరుదైన రికార్డ్

May 22 2026 11:44 AM | Updated on May 22 2026 1:29 PM

Suriya film smashes Rs 200 crore globally in first week

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం కరుప్పు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ తొలి మూడు రోజుల్లోనే వందకోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో సూర్య లాయర్‌ పాత్రలో కనిపించారు. ఈ చిత్రాన్ని తెలుగులో వీరభద్రుడు పేరుతో విడుదల చేశారు. 

తాజాగా ఈ మూవీ అరుదైన ఫీట్ సాధించింది. రిలీజైన వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల మార్క్ అధిగమించింది. ఇండియా వ్యాప్తంగా ఏడో రోజు రూ. 8.30 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. దీంతో మనదేశంలో రూ. 114.05 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. గ్రాస్ వసూళ్లను చూస్తే దేశవ్యాప్తంగా  రూ. 132.05 కోట్లు.. ఓవర్‌సీస్‌లో రూ. 57 కోట్లు కలెక్ట్ చేసింది.

ఓవరాల్‌గా చూస్తే ఏడు రోజుల్లోనే  ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 207 కోట్లు వసూలు చేసింది. ముఖ్యంగా తమిళ వర్షన్‌లో అత్యధిక వసూళ్లు రాబడుతోంది. కేవలం తమిళ వెర్షన్ మాత్రమే ఏడో రోజు రూ. 7 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో త్రిషా కృష్ణన్, శివాడ, యోగి బాబు, స్వాసిక కీలక పాత్రల్లో నటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement