Superman: సరికొత్తగా రాబోతున్న సూపర్‌మ్యాన్‌.. షాక్‌లో ఫ్యాన్స్‌

Superman is Coming Out as Bisexual in next Month - Sakshi

ప్రపంచ వ్యాప్తంగా సూపర్‌మ్యాన్‌ సినిమాలకి, కామిక్స్‌కి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ తెలిసిందే. ప్రపంచం ప్రమాదపు అంచుల్లో ఉన్నప్పుడల్లా వచ్చి కాపాడుతుంటాడు. అతనికి, లూయిస్‌ లేన్‌కి పుట్టిన కొడుకే జాన్‌ కెంట్‌. ఇప్పుడు కొత్త సూపర్‌మ్యాన్‌గా అవతారం ఎత్తబోత్తున్నాడు. హీరోలకి వారసులు రావడం ఎ​క్కడైనా జరిగేదే. కానీ ఈ వారసుడు మాత్రం నార్మల్‌గా రావట్లేదు. అదే ఇక్కడ షాకింగ్‌ విషయం.

ఇప్పటి వరకూ ఉన్న సూపర్‌ మేన్‌ క్లార్క్ కెంట్‌కి విరుద్ధంగా ఈ సారి అతని కొడుకు ‘బైసెక్సువల్‌’ సూపర్‌మ్యాన్‌గా రాబోతున్నాడు. అదే సంచలనానికి దారి తీసింది. ఈ సూపర్‌ హీరో ‘బైసెక్సువల్‌’గా రానున్నట్లు తెలుపుతూ డీసీ కామిక్స్‌ రైటర్స్‌ ‘సూపర్‌​మ్యాన్‌: ది సన్‌ ఆఫ్‌ కాల్‌-ఎల్‌’ ఓ పిక్‌ని విడుదల చేశారు. అందులో జాన్‌, తన ప్రియుడైన రిపోర్టర్ జై నకమూరాను కిస్ చేస్తున్నాడు. 

‘చాలా మంది ఫ్యాన్స్‌ తమ ఫేవరేట్‌ హీరోలో తమను చూసుకోవాలనుకుంటారు. సూపర్‌మేన్‌ సింబల్‌ హోప్‌కి, నిజానికి, న్యాయానికి ప్రతీక నిలుస్తుంటుంది. ఈ మార్పు ఇకపై ఎక్కువ విషయాలకి ప్రతీకగా నిలువబోతోంది.  ఇకపై మోస్ట్‌ పవర్‌ఫుల్‌ హీరోలో తమని తాము చూసుకోబోతున్నారని’ డీసీ కామిక్స్‌ రైటర్‌ టామ్‌ టేలర్‌ తెలిపాడు. అయితే ఈ విషయమై సూపర్‌ హీరో అభిమానులు, గతంలో ఈ క్యారెక్టర్‌ చేసిన నటులు విమర్శలు చేస్తున్నారు.

చదవండి: జేమ్స్‌ బాండ్ స్టార్ డేనియల్‌ క్రెగ్‌కి అరుదైన గౌరవం

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top