సుజాత మోహన్.. సౌత్ ఇండస్ట్రీలో పేరుమోసిన గాయని. మలయాళ, తెలుగు, తమిళ, కన్నడతో పాటు హిందీ, మరాఠి భాషల్లోనూ అనేక పాటలు పాడింది. దాదాపు 20 వేల పాటలు ఆలపించింది. టాలీవుడ్‌కు అనేక హిట్స్ ఇచ్చింది. అయితే కొంతకాలంగా ఆమె పాటలు పాడటమే మానేసింది. అందుకు గల కారణాన్ని తాజాగా ఓ వేదికపై బయటపెట్టింది.
ఐదేళ్లుగా పాటల్లేవ్
సుజాత మోహన్ మాట్లాడుతూ.. నేను గొంతు సమస్యతో బాధపడుతున్నాను. దానివల్ల మునుపటిలా పాడలేకపోతున్నాను. అందుకే ఐదేళ్లుగా ఎక్కడా ఒక్క పాట కూడా పాడలేదు అని తెలిపింది. ఇది విని ఆమె అభిమానులు షాకవుతున్నారు. తను త్వరగా కోలుకుని మళ్లీ తన గాత్రంతో అలరించాలని ఆకాంక్షిస్తున్నారు. దీనిపై సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సోదరి ఏఆర్ రెహానా స్పందిస్తూ.. గతంలో సుజాతకు కోరస్‌గా పాడాను.
గొంతు సమస్య
అప్పుడు ఆమె దగ్గరినుంచి చాలా నేర్చుకున్నాను. తన గొంతు తనకు తిరిగి రావాలని కోరుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న డాక్టర్స్ ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేయండి అని కోరింది. కాగా గతంలోనూ సుజాత గొంతు సమస్యతో బాధపడింది. 2010వ దశకంలో మాట్లాడేందుకు సైతం ఇబ్బందిపడింది. మూడేళ్లపాటు తన గొంతును తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. చివరకు మంచి చికిత్స ద్వారా కోలుకుని మళ్లీ పాటలు పాడింది.
పాటలు
సుజాత మోహన్ తెలుగులో అనేక హిట్ సాంగ్స్ పాడింది. తెలుగులో పరువం వానగా, నా చెలి రోజావే.. (రోజా మూవీ), ఓ చెలియా.. (ప్రేమికుడు), రూప్ తేరా మస్తానా (రిక్షావోడు), మూసిన ముత్యాలకే.., ఏలే ఏలే మరదలా (అన్నమయ్య).. ఓ వానా పడితే (మెరుపు కలలు), సారీ సారీ (బావగారు బాగున్నారా), పూవుల్లో దాగున్న (జీన్స్), అందాల ఆడబొమ్మ (సమరసింహారెడ్డి), చెప్పవే చిరుగాలి (ఒక్కడు) ఇలా అనేకానేక పాటలతో తెలుగు సంగీత ప్రియులను అలరించింది.
చదవండి: మంచివాళ్లకే మంచివాడిని.. నావాళ్ల జోలికొచ్చారంటే: పవన్


