మూడో సినిమాకి ముహూర్తం | Sudheer Babu and Indraganti Hat trick combination again | Sakshi
Sakshi News home page

మూడో సినిమాకి ముహూర్తం

Jan 5 2021 6:30 AM | Updated on Jan 5 2021 6:30 AM

Sudheer Babu and Indraganti Hat trick combination again - Sakshi

‘సమ్మోహనం, ‘వి’ చిత్రాల తర్వాత హీరో సుధీర్‌ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందనున్న మూడో చిత్రానికి శ్రీకారం జరిగింది. గాజుల పల్లి సుధీర్‌బాబు సమర్పణలో బెంచ్‌ మార్క్‌ స్టూడియోస్‌ పతాకంపై బి.మహేంద్రబాబు, కిరణ్‌ బల్లపల్లి నిర్మించనున్న ఈ సినిమా  హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన తొలి సీన్‌కి  నిర్మాత వై. రవిశంకర్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, డైరెక్టర్‌ వీవీ వినాయక్‌ క్లాప్‌ ఇచ్చారు. నిర్మాత ‘దిల్‌’ రాజు గౌరవ దర్శకత్వం వహించగా, డైరెక్టర్‌ వెంకీ కుడుముల స్క్రిప్ట్‌ను చిత్రబృందానికి అందజేశారు. ‘‘రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కనున్న చిత్రమిది. మోహనకృష్ణ ఇంద్రగంటి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఇది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. కృతీ శెట్టి హీరోయిన్‌గా నటించనున్న ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, ‘వెన్నెల’ కిశోర్‌ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్‌ సాగర్, కెమెరా: పీజీ విందా.

Advertisement
 
Advertisement
Advertisement