సినిమాను తెరకెక్కించడమే కాదు..దాన్ని జనాలకు రీచ్ అయ్యేలా ప్రచారం చేయడంతో రాజమౌళి(SS Rajamouli) దిట్ట. ఎలా ప్రమోషన్స్ చేస్తే ఒక సినిమా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది? ఎలాంటి ఈవెంట్స్ పెడితే సీనీ ప్రేక్షకులు ఆకర్షితులవుతారు? అనే విషయం జక్కన్నకు బాగా తెలుసు. అంతేకాదు తన ప్రచారాన్ని ఎలా సొమ్ము చేసుకోవాలో కూడా ఆయన తెలిసినట్లుగా మరెవరికీ తెలియదేమో.
బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాలకు జక్కన చేసిన ప్రమోషన్స్ చాలా ప్లస్ అయ్యాయి. దేశవ్యాప్తంగా ఆయన నిర్వహించిన ఈవెంట్స్ రిలీజ్‌కు ముందే సినిమాపై హైప్‌ని క్రియేట్ చేశాయి. ఇప్పుడు మహేశ్‌బాబు సినిమా(SSMB29)ను కూడా స్ట్రాటజీని అప్లే చేయబోతున్నారు. ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారట. టైటిల్ అనౌన్స్‌మెంట్ మొదలు..టీజర్, ట్రైలర్.. ఇలా పలు ఈవెంట్లను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబోతున్నారు. ఈ నెల 15న సినిమా టైటిల్‌ని ప్రకటించబోతున్నారు. ఈ ఈవెంట్‌ని హైదరాబాద్‌లోని రామోజీఫిల్మ్ సిటీలో నిర్వహించబోతున్నారు.
భారీ ధరకు ప్రచార రైట్స్
జక్కన్న ఏం చేసిన కొత్తగా ఉంటుంది. అలాగే ప్రతీదీ బడ్జెట్‌ని దృష్టిలో పెట్టుకొనే చేస్తాడు. ప్రమోషన్స్‌కి భారీగా ఖర్చు చేస్తున్న జక్కన్న.. ఆ సొమ్ముని కూడా తిరిగి నిర్మాతకు అప్పగిస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్‌కి అమ్మేశారు. భారీ ధరకు జియోస్టార్ ఈ రైట్స్‌ని కొనుగోలు చేసినట్లు సమాచారం. టైటిల్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్ మొదలు.. ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఈవెంట్స్‌ని జియోస్టార్‌కు విక్రయించి..ఈ రూపంలోనూ నిర్మాతకు భారీ సొమ్ముని అందించాడట. ఇప్పటివరకు ఏ సినిమా టైటిల్ రివిల్ కార్యక్రమానికి సంబంధించిన హక్కులను ఇలా ఓటీటీ సంస్థలు కొనుగోలు చేయలేదు.  కానీ తొలిసారి మహేశ్ బాబు- రాజమౌళి సినిమా విషయంలోనే ఇలా జరగటం విశేషం.
(చదవండి: 100 కోడిగుడ్లతో కొట్టించుకున్న స్టార్ హీరో.. ఒక్క మాట అనలేదు!)
ఈ నెల 15న జరిగే టైటిల్ రిలీజ్ ఈవెంట్‌కి దాదాపు లక్ష మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ గ్లింప్స్ ని ప్రదర్శించడానికి రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ తెర ఏర్పాటు చేస్తున్నారట. భారతీయ సినీ చరిత్రలో ఇంతవరకు జరగని రీతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారట.
టైటిల్ ఇదేనా.. 
రాజమౌళి ఒక సినిమాను ప్రకటించినప్పుడే వర్కింగ్ టైటిల్‌ని ప్రకటిస్తాడు. అదే టైటిల్‌ని సినిమాకు పెట్టి..అధికారికంగా వెల్లడిస్తాడు. కానీ మహేశ్ బాబు సినిమా టైటిల్ విషయంలో జక్కన్న గోప్యత పాటించాడు. సినిమా పేరు గురించి ఇంతవరకు ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ ‘వారణాసి’అనే టైటిల్‌ని పెట్టబోతున్నట్లు ఆ మధ్య నెట్టింట వైరల్ అయింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసే సినిమాకు అలాంటి సింపుల్ టైటిల్ పెట్టరని చాలా మంది కొట్టిపారేశారు. 
(చదవండి: 'రాజాసాబ్' వాయిదా రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత)
మహేశ్ ఫ్యాన్స్ కూడా పెదవి విరిచారు. కానీ ఈ సినిమాకు ‘వారణాసి’నే టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 15న ఇదే టైటిల్‌ని ప్రకటిస్తారట. ఇప్పటికే ఈ పేరుని మరో నిర్మాత ఫిలిం చాంబర్‌లో రిజిస్టర్ చేయించుకొన్నాడు . ఆయన అనుమతి కోసం ప్రయత్నిస్తున్నారట. ఒకవేళ అది కుదరకపోతే..‘వారణాసి’ ముందో లేదా వెనకాలో ఏదో ఒక పదాన్ని యాడ్ చేసి నవంబర్ 15న టైటిల్‌ని ప్రకటిస్తారు. టైటిల్ కోసం మహేశ్ ఫ్యాన్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సినీ ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
