
స్టార్ డైరెక్టర్ రాజమౌళి.. ప్రస్తుతం మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ ఉందని అందరికీ తెలుసు. కానీ రాజమౌళి ఒక్కటంటే ఒక్క మాట బయటపడకుండా జాగ్రత్త పడుతున్నాడు. అటు మహేశ్ బాబు కూడా పిన్ డ్రాప్ సైలెంట్ అనేలానే ఉన్నాడు. మిగతా టీమ్ అంతా కూడా ఒక్క ఫొటో కూడా పోస్ట్ చేయట్లేదు. కానీ హీరోయిన్ మాత్రం అస్సలు తగ్గట్లేదు. ఫొటోలు పోస్ట్ చేస్తూనే ఉంది. తాజాగా ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.
రాజమౌళి-మహేశ్ బాబు సినిమాకు 'SSMB29' అనే వర్కింగ్ టైటిల్ నిర్ణయించారు. ఇందులో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా చేస్తోంది. షూటింగ్ జరిగిన ప్రతిసారి ఆ ప్రాంత ఫొటోలని ఈమె పోస్ట్ చేస్తూనే ఉంది. కొన్ని నెలల క్రితం ఒడిశాలో షూటింగ్ జరగ్గా.. అప్పుడు కూడా ఆయా ప్రాంతంలో తీసుకున్న కొన్ని ఫొటోల్ని ప్రియాంక పోస్ట్ చేసింది. ఇప్పుడు టీమ్ అంతా కెన్యాలో చిత్రీకరణ చేస్తోంది. అక్కడ పర్యావరణ అందాల్ని తన కెమెరాలో బంధించిన ఈ బ్యూటీ.. పలు ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో మహేశ్ ఫ్యాన్స్‌కి షూటింగ్ అప్డేట్ ఇచ్చినట్లయింది.
(ఇదీ చదవండి: హీరో అసభ్య ప్రవర్తన.. నేను ఎంజాయ్ చేయలేదు, ఏడ్చా.. ఇండస్ట్రీకో దండం!)
చాలా ఏళ్ల క్రితమే రాజమౌళి.. కెన్యా వెళ్లి వచ్చాడు. అప్పుడు లొకేషన్ల కోసం కాగా ఇప్పుడు షూటింగ్ జరుగుతోంది. అయితే ఆగస్టు 9న మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఏదైనా లుక్, పోస్టర్ లాంటిది వస్తుందని అభిమానులు ఆశపడ్డారు. కానీ నవంబర్‌లోనే అఫీషియల్ పోస్టర్ వస్తుందనే అప్‌డేట్ లాంటిది ఆ రోజున ప్రకటించారు. ఇప్పుడు కెన్యాలో ఎలాంటి సౌండ్ లేకుండా షూటింగ్ చేసుకుంటున్నారు. గత చిత్రాలతో పోలిస్తే రాజమౌళి ఈసారి భిన్నంగా ప్రవర్తిస్తుండటం విశేషం.
ఇకపోతే ఈ మూవీ గ్లోబ్ ట్రాటెర్ కాన్సెప్ట్ అని చాన్నాళ్ల క్రితమే చెప్పారు. అంటే ఈ స్టోరీలో హీరో ప్రపంచమంతా తిరుగుతుంటాడు. అడ్వెంచర్స్ చేస్తుంటాడు. మహేశ్ బాబుకి విలన్‌గా 'సలార్' ఫేమ్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు. ఈ విషయం కూడా చాన్నాళ్ల క్రితం లీకైన ఓ వీడియో వల్ల బయటపడింది.
(ఇదీ చదవండి: ఎంగేజ్‌మెంట్‌తో మారిపోయా.. ఇకపై అలాంటి సీన్లు చేయను: విశాల్)