శ్రీలీల హీరోయిన్‌గా 'ఐ లవ్‌ యూ ఇడియట్‌', రిలీజ్‌ ఎప్పుడంటే? | Sreeleela I Love You Idiot Movie Gets Release Date | Sakshi
Sakshi News home page

Sreeleela: శ్రీలీల 'ఐ లవ్‌ యూ ఇడియట్‌' సినిమా రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

Dec 9 2022 6:04 PM | Updated on Dec 9 2022 6:04 PM

Sreeleela I Love You Idiot Movie Gets Release Date - Sakshi

ప్రస్తుతం పెద్ద చిత్రాల్లో నటిస్తున్న శ్రీలీల మా చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. ఆమె అందం, అభినయం మా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అన్నాడు.

విరాట్‌, శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘‘ఐ లవ్‌ యు ఇడియట్‌’’. ఎపి అర్జున్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అవిరుద్ర క్రియేషన్స్‌ బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్, శ్రీమతి వసంత సమర్పణలో సాయి కిరణ్‌ బత్తుల, సుదర్శన్‌ గౌడ్‌ బత్తుల, ఎపి.అర్జున్‌ నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్‌ 17న గ్రాండ్‌గా విడుదలవుతున్న సందర్బంగా చిత్ర యూనిట్ ‘‘ఐ లవ్‌ యు ఇడియట్‌’’ ట్రైలర్‌ను విడుదల చేసింది.

ఈ సందర్భంగా నిర్మాత సాయికిరణ్‌ బత్తుల మాట్లాడుతూ.. ‘ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మంచి చిత్రాలను  ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ప్రస్తుతం పెద్ద చిత్రాల్లో నటిస్తున్న శ్రీలీల మా చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. ఆమె అందం, అభినయం మా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అన్నాడు.

దర్శకుడు ఎపి అర్జున్‌ మాట్లాడుతూ... 'చిన్న సినిమాలకు  సపోర్ట్ గా నిలిచే బెక్కెం వేణుగోపాల్ గారు మా సినిమా రిలీజ్ చేయడానికి ముందుకు రావడం సంతోషం. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు ఈ చిత్రం ఉంటుంది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు’’ అని చెప్పుకొచ్చాడు.

చదవండి: శ్రీహాన్‌తో బ్రేకప్‌ దాకా వెళ్లా... చాలా జరిగాయి: సిరి హన్మంత్‌
కేజీఎఫ్‌ విలన్‌తో నటి ఎంగేజ్‌మెంట్‌, వీడియో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement