మోహన్ బాబుతో మాకు ఎలాంటి ఆస్తి గొడవల్లేవు: సౌందర్య భర్త | Soundarya Husband Raghu Responds Allegations On Mohan Babu | Sakshi
Sakshi News home page

మోహన్ బాబుతో మాకు ఎలాంటి ఆస్తి గొడవల్లేవు: సౌందర్య భర్త

Mar 12 2025 4:24 PM | Updated on Mar 12 2025 4:41 PM

Soundarya Husband Raghu Responds Allegations On Mohan Babu

దివంగత నటి సౌందర్య(Soundarya ), మోహన్‌ బాబు(Mohan Babu) మధ్య ఆస్తి తగాదాలు వచ్చాయని, సౌందర్య ప్రమాదంలో చనిపోలేదని, ప్లాన్‌ చేసి చంపేశారంటూ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి బహిరంగ లేఖ రాసి నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై సౌందర్య భర్త రఘు స్పందించాడు. మోహన్‌ బాబుతో తమకు ఎలాంటి ఆస్తి గొడవలు లేవని స్పష్టం చేశాడు. ఈ మేరకు బహిరంగ లేఖను విడుదల చేశాడు.

‘గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని సౌందర్య ఆస్తికి సంబందించి  తప్పుడు ప్రచారం జరుగుతోంది. సౌందర్య ఆస్తిని మోహన్ బాబు ఆక్రమించుకున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మోహన్ బాబుతో సౌందర్య ఎలాంటి భూ లావాదేవీలు జరపలేదు.మంచు ఫ్యామిలీతో  మాకు  25 ఏళ్లుగా మంచి అనుబంధం ఉంది .మోహన్ బాబును నేను గౌరవిస్తాను, మేమంతా ఒకే కుటుంబంగా ఉంటాం.మోహన్ బాబుతో మాకు ఎలాంటి ఆస్తి గొడవలు, లావాదేవీలు లేవు. దయచేసి తప్పుడు ప్రచారాలు చేయకండి’ అని లేఖలో పేర్కొన్నాడు. 


 

Advertisement
 
Advertisement
Advertisement