మా విషయం స్టేజ్‌పై చెప్పగానే జాను పేరెంట్స్‌ కాస్తా.. | Singer Yasaswi Kondepudii Reveals About His Love Story | Sakshi
Sakshi News home page

జాను కోసమే 7స్కూళ్లు మారాను : యశస్వి

Apr 2 2021 1:57 PM | Updated on Apr 2 2021 3:40 PM

Singer Yasaswi Kondepudii Reveals About His Love Story - Sakshi

ఒకే ఒక్క పాటతో ఓవర్‌నైట్‌ స్టార్‌ సింగర్‌ అయ్యాడు యశస్వి కొండెపూడి. జాను చిత్రంలోని లైఫ్‌ ఆఫ్‌ రామ్‌ పాటను అద్భుతంగా పాడి బోలెడంత పాపులారిటీ సంపాదించుకున్న యశస్వి తన రియల్‌ లైఫ్‌లోని జాను గురించిన ఇలా చెప్పకొచ్చాడు..

ఒకే ఒక్క పాటతో ఓవర్‌నైట్‌ స్టార్‌ సింగర్‌ అయ్యాడు యశస్వి కొండెపూడి. జాను చిత్రంలోని లైఫ్‌ ఆఫ్‌ రామ్‌ పాటను అద్భుతంగా పాడి బోలెడంత పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఈ పాట తర్వాత యశస్వి క్రేజ్‌ అమాంతం పెరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘సరిగమప-13’ టైటిల్‌‌ విన్నర్‌గా నిలిచాడు. తాజాగా ఓ యూట్యూబ్‌ ఇంటర్వ్యూలో మాట్లాడిన యశస్వి...ఏడో తరగతిలోనే తన లవ్‌స్టోరీ మొదలైందని చెప్పుకొచ్చాడు. తన ప్రేయసి జానూ కోసమే 7స్కూళ్లు మారానని చెప్పాడు. నిజానికి తనకు పైలట్‌ అవ్వాలని చిన్నప్పటి నుంచి ఆశ ఉండేదని, అయితే తన ప్రేయసి కోసమే బైపీసీలో జాయిన్‌ అయ్యానని పేర్కొన్నాడు. 

'నా లవ్‌స్టోరీ గురించి ఇంట్లో తెలుసు. కానీ ఏదో సరదాగా అంటున్నానని లైట్‌ తీసుకున్నారు. ఇంత సీరియస్‌ అని అనుకోలేదు. జానూని ఓ షోలో పరిచయం చేస్తున్నానని చెప్పినప్పుడు ఇప్పుడే ఎందుకు అందరికి తెలియడం అని మా పేరెంట్స్‌ అన్నారు. అయితే ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం కదా..అందరికి తెలిస్తే తప్పేంటి అని చెప్పా. ఇక జానూ వాళ్ల ఇంట్లో ఈ విషయం చెబితే..అలా పబ్లిక్‌లో బయటపెట్టడం ఎందుకు అని కాస్త ఆలోచించారు. కానీ మేం అవన్నీ వదిలేశాం. జీతెలుగు ద్వారా మేం ప్రేమికులం అని తెలిసిపోయింది' అని తన లవ్‌స్టోరీ గురించి చెప్పుకొచ్చాడు. 

చదవండి : మ్యూజిక్‌ నేర్చుకోలేదు: యశస్వి కొండేపూడి
‘ఫస్ట్‌ ఎపిసోడ్‌లోనే ఎలిమినేట్‌ అయిపోతాననుకున్నా’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement