
‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ చిత్రాల ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’ చిత్రీకరణ పూర్తయింది. ఈ మూవీలో రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటించగా, వైవా హర్ష కీలక పాత్ర పోషించారు. స్టైలిస్ట్ నీరజ కోన ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్, టీజీ కృతీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.
ఈ సందర్భంగా లొకేషన్‌లో కేక్ కట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకుంది యూనిట్. ‘‘మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘తెలుసు కదా’. నీరజ కోన చాలా యూనిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఇటీవల విడుదల చేసిన మా మూవీ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. తమన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం నుంచి త్వరలో సెకండ్ సాంగ్ రిలీజ్ కానుంది. అక్టోబర్ 17న మా సినిమా విడుదల కానుంది’’ అని చిత్రబృందం పేర్కొంది.