బోల్డ్‌ కంటెంట్‌ను ఎంకరేజ్‌ చేస్తారని అర్థమైంది: యంగ్‌ హీరో | Shubh Mangal Saavdhan Clocks 4 Years, Ayushmann Khurrana Gets Emotional | Sakshi
Sakshi News home page

Ayushmann Khurrana: అవే నన్ను నటుడిగా నిలబెట్టాయి

Sep 1 2021 7:05 PM | Updated on Sep 1 2021 7:10 PM

Shubh Mangal Saavdhan Clocks 4 Years, Ayushmann Khurrana Gets Emotional - Sakshi

Ayushmann Khurrana: 'విక్కీ డోనర్‌' సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు ఆయుష్మాన్‌ ఖురానా. తొలి సినిమాతోనే సక్సెస్‌ను అందుకున్న ఈ హీరో తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్‌ సంపాదించుకున్నాడు. బదాయి హో, బాలా, శుభ్‌మంగళ్‌ సావధాన్‌, అంధాధున్‌ వంటి పలు హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా రిలీజై నేటికి(సెప్టెంబర్‌1) నాలుగేళ్లు. ఈ సందర్భంగా తన కెరీర్‌ గురించి మాట్లాడుతూ ఎమోషనల్‌ అయ్యాడు.

"విక్కీ డోనర్‌ వంటి బోల్డ్‌ కంటెంట్‌తో బాలీవుడ్‌కి పరిచయం అయ్యాను. విక్కీ డోనర్‌, శుభ్‌మంగళ్‌ సావధాన్‌ సినిమాలు తన సబ్జెక్టుల ఎంపికపై ఎంతో ప్రభావం చూపాయి. ఆ రెండు సినిమాల విజయంతో బోల్డ్‌ కంటెంట్‌ని కూడా ప్రేక్షకులు ఎంకరేజ్‌ చేస్తారని అర్థమయ్యింది. ఇలాంటి డిఫరెంట్‌ సబ్జెక్టుల ఎంపికే నన్ను నటుడిగా నిలబెట్టింది' అని పోస్టులో పేర్కొన్నారు. ఆ పోస్టులో తన సినిమాల దర్శకులైన సుజిత్‌ సర్కార్‌, ఆనంద్‌ ఎల్‌. రాయ్‌, ఆర్‌.ఎస్‌.ప్రసన్నలకు హీరో కృతజ్ఞతలు తెలిపాడు. కాగా ఆయుష్మాన్‌ 2018లో అంధాధున్‌ సినిమాకి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఆయన తదుపరి సినిమాలు డాక్టర్‌ జీ, అనేక్‌ నిర్మాణ దశలో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement