అతను నా క్లాస్‌మేట్‌.. స్టార్‌ హీరోపై శృతి హాసన్‌ కామెంట్‌ | Shruti Haasan comments on Dulquer Salmaan relation | Sakshi
Sakshi News home page

అతను నా క్లాస్‌మేట్‌.. స్టార్‌ హీరోపై శృతి హాసన్‌ కామెంట్‌

Mar 25 2026 7:13 AM | Updated on Mar 25 2026 10:28 AM

Shruti Haasan comments on Dulquer Salmaan relation

పాన్‌ ఇండియా కథానాయికల్లో ఒకరు శృతి హాసన్‌. ఈమె నటుడు కమలహాసన్‌ వారసురాలు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కథానాయకి, గాయని, సంగీత దర్శకురాలు ఇలా పలు విభాగాల్లో తన ప్రతిభను చాటుకుంటూ తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటున్న నటి ఈమె. అంతేకాకుండా సంచనాలకు నిలయం శృతి హాసన్‌(Shruti Haasan) అనే ట్యాగ్‌లైన్‌ను కూడా వేసుకున్నారీమె. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ అభిమానుల్లో  జోష్‌ నింపే ఈమె ప్రేమ వ్యవహారం  కూడా తెలిసిన పుస్తకమే. కాగా మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌ హీరోయిన్లలో ఈ బ్యూటీ ఒకరిగా ఉన్నారు. 

కాగా ఇటీవల ఒక బేటిలో శృతిహాసన్‌ తన పాఠశాల జీవిత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అందులో భాగంగా నటుడు దుల్కర్‌ సల్మాన్‌ గురించి తెలిపారు. దుల్కర్‌ సల్మాన్‌ తాను బాల్యంలో చెన్నైలో ఓకే స్కూల్లో కలిసి చదువుకున్నామని చెప్పారు. రెండు ప్రముఖ పాఠశాలల్లో  తమ విద్యాభ్యాసం జరిగిందన్నారు. ఆ సమయంలో తాము తరచూ కలుసుకునేవారుమని చెప్పారు. ఆయన తనను సోంబి అని పిలిచేవాడన్నారు. అప్పట్లో పలువురు సహా విద్యార్థులతో కలిసి తాను సోంబి పాటను పాడిన అనుభవం ఉందన్నారు. 

ఆ తర్వాతనే తనను దుల్కర్‌ సల్మాన్‌ సోంబి అని పిలిచే వాడిని పేర్కొన్నారు. అతనితో కలిసి చదివిన విద్యార్థులకు తాను కమలహాసన్‌ కూతురు అన్న విషయం మాత్రమే తెలుసు అని, తన పేరు తెలియదని చెప్పారు. కాగా తాజాగా ఈ భామ దుల్కర్‌  సల్మాన్‌తో కలిసి  ఆకాశంలో ఒక తార అనే తెలుగు చిత్రం లో నటించడం విశేషం. ఈ చిత్రం తమిళం, కన్నడం మలయాళం హిందీ భాషల్లో రూపొందుతోంది.  

Advertisement
 
Advertisement
Advertisement