అచ్చం ఆ హీరోయిన్‌లా... సాహో బ్యూటీ ఫన్నీ రియాక్షన్‌! | Shraddha Kapoor Hilarious Response To Her Viral Doppelganger Spotted At IPL Match, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Shraddha Kapoor: ఒక్క ఐపీఎల్‌ మ్యాచ్‌తో వైరల్‌.. హీరోయిన్‌ రెస్పాన్స్‌ చూశారా?

Published Mon, Apr 15 2024 12:48 PM

Shraddha Kapoor Hilarious Response to her Viral Doppelganger Spotted at IPL Match - Sakshi

కెమెరామెన్లలో ఐపీఎల్‌ కెమెరామెన్స్‌ ప్రత్యేకం.. వీరు గ్రౌండ్‌లో ఆటపై ఎంత దృష్టిపెడతారో, ఆ ఆటను వీక్షించేందుకు వచ్చిన అందమైన అమ్మాయిలపైనా అంతే దృష్టి సారిస్తారు. ఎప్పటికప్పుడు కొత్త అందాలను వెలుగులోకి తీసుకువస్తుంటారు. స్టేడియంలో సెలబ్రిటీలు దాగి ఉన్నా సరే.. వారిని ఇట్టే పట్టేసుకుంటారు. అలా ఇటీవల ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య పోటీ జరిగింది.

అచ్చం హీరోయిన్‌లా..
ఈ మ్యాచ్‌లో ఓ అందమైన యువతిని హైలైట్‌ చేసి తనను కాస్తా వైరల్‌ చేశారు. చాలామంది ఆమెను హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌తో పోల్చారు. ఇది చూసిన శ్రద్దా కపూర్‌ సోషల్‌ మీడియాలో ఫన్నీగా స్పందించింది. అచ్చం తనలాగే ఉన్న ఆ అమ్మాయి ఫోటో షేర్‌ చేస్తూ.. 'హేయ్‌, అది నేనే' అని నవ్వుతున్న ఎమోజీ షేర్‌ చేసింది. ఇకపోతే హీరోయిన్‌కు జిరాక్స్‌లా ఉన్న ఆమె పేరు ప్రగతి.

హీరోయిన్‌తో కలిసి..
ఒక్క మ్యాచ్‌తో వైరలైపోయిన ఈ బ్యూటీ మనిద్దరం కలిసి మ్యాచ్‌ చూద్దాం కదా.. అంటూ శ్రద్దా కపూర్‌ను ట్యాగ్‌ చేసింది. మరి ఆమె ఏమని స్పందిస్తుందో చూడాలి! శ్రద్ధా కపూర్‌ విషయానికి వస్తే.. ఆమె చివరగా తు ఝూటీ మే మక్కర్‌ అనే హిట్‌ మూవీలో నటించింది. ప్రస్తుతం స్త్రీ 2 అనే హారర్‌ మూవీ చేస్తోంది. ఈ చిత్రం ఆగస్టు 31న విడుదల కానుంది. 

చదవండి: రూ.3 కోట్ల లగ్జరీ కారు కొన్న బిగ్ బాస్‌ విన్నర్!

Advertisement
 
Advertisement
 
Advertisement