షారూక్ ఖాన్‌కు ఈగో ఎక్కువ.. అందుకే నచ్చలేదు: సింగర్‌ అభిజిత్ | Shah Rukh Khan even not say sorry once Singer Abhijeet blames actor ego | Sakshi
Sakshi News home page

Singer Abhijeet: 'షారూక్ ఖాన్‌కు ఈగో.. అందుకే మానేశా'

May 1 2026 4:02 PM | Updated on May 1 2026 4:22 PM

Shah Rukh Khan even not say sorry once Singer Abhijeet blames actor ego

ప్రముఖ బాలీవుడ్ సింగర్ అభిజీత్ భట్టాచార్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ గురించి ఆయన మాట్లాడారు. షారూక్‌తో వచ్చిన విభేదాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ సూపర్‌స్టార్ క్షమాపణ చెప్పకపోవడం వల్లే మా ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని తెలిపారు. షారూక్ ఖాన్‌కు ఉన్న అహం వల్లే వృత్తిపరంగా ఆయన సినిమాలకు పనిచేయడం లేదని అన్నారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌కు హాజరైన ఆయన షారూక్‌తో విభేదాలపై స్పందించారు. 

విభేదాలకు ‍అదే కారణం..

పాడ్‌కాస్ట్‌లో అభిజీత్ మాట్లాడుతూ.. 'షారుఖ్ ఖాన్‌కు అహం ఎక్కువ. నాకు ఆత్మగౌరవమే ముఖ్యం. అందే మా మధ్య విభేదాలకు కారణమైంది. షారుఖ్ నా కంటే చిన్నవాడు.. అయినా ఫరా ఖాన్ భర్త అతన్ని అంతగా దూషించినప్పుడు కూడా షారుఖ్ అతన్ని కౌగిలించుకున్నాడు. ఆమిర్ ఖాన్ ఒక కుక్కకు షారూఖ్ అని పేరు కూడా పెట్టాడు.. అయినా వారిద్దరూ స్నేహితులుగా ఉన్నారు. అయినా మీరు ఒక్కసారి కూడా క్షమాపణ చెప్పలేకపోవడం నన్ను బాధించింది. మీరు అంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ నాకు క్షమాపణ చెప్పలేదు” అని అన్నారు. ఇదే తనపై భావోద్వేగమైన ప్రభావం చూపిందని పేర్కొన్నారు.

షారూఖ్ తాను చేసిన తప్పును అంగీకరించకపోవడమే తనను ఎక్కువగా బాధించిందని అభిజిత్ అన్నారు. అందుకే షారూక్ ప్రాజెక్టులకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. అయితే తన నిర్ణయం అహంకారంతో కాదని.. వ్యక్తిగత నిరాశతోనే తీసుకున్నానని సింగర్ స్పష్టం చేశారు. ఒకానొక సమయంలో షారూక్ కోసం తాను ఇతర నటుల కోసం కూడా పాడటం మానేశానని అన్నారు. 

షారుక్‌ ఖాన్‌తో సన్నిహితంగా ఉన్నప్పటికీ తనను పట్టించుకోవడం లేదని అనిపించేదని అభిజీత్ భట్టాచార్య అన్నారు. నాకు సరైన గుర్తింపు, క్రెడిట్ లేకపోవడం వల్లే షారూక్‌తో విభేదాలు తలెత్తాయని గతంలో అభిజీత్ చాలాసార్లు వెల్లడించారు.  కాగా.. సింగర్ అభిజిత్‌   'బాద్షా', 'మై హూ నా' వంటి చిత్రాలలోని పాటలకు తన గాత్రం అందించారు. మై హూ నా మూవీ టైమ్‌లో తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని అన్నారు. అభిజిత్ చివరిసారిగా షారూక్ బిల్లు చిత్రానికి పనిచేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement