రూ.20 కోసం గొడవ.. ఒంటిపై కిరోసిన్‌ పోసుకున్నా: నటుడు ఎమోషనల్‌ | Serial Actor Shivakumar about His Father Cruelty | Sakshi
Sakshi News home page

ఎవడితో తిరుగుతున్నావ్‌? అని అమ్మను తరచూ కొట్టేవాడు: సీరియల్‌ నటుడు

May 28 2026 1:58 PM | Updated on May 28 2026 2:14 PM

Serial Actor Shivakumar about His Father Cruelty

శివకుమార్‌.. ఈ బుల్లితెర నటుడు మౌనరాగం సీరియల్‌తో ఫేమస్‌ అయ్యాడు. ప్రస్తుతం తెలుగులో ఓ ధారావాహికలో ప్రధాన పాత్రలో కనిపిస్తున్నాడు. అయితే సీరియల్స్‌ కన్నా సోషల్‌ మీడియాలోనే ఈయన ఎక్కువ పాపులర్‌ అయ్యాడు. ముఖ్యంగా అతడి ప్రేమ వ్యవహారం ఆన్‌లైన్‌లో ఎప్పుడూ హాట్‌ టాపిక్‌గానే ఉంటుంది.

కలిసుంటున్న జోడీ
'మౌనరాగం', 'జానకి కలగనలేదు' సీరియల్స్‌ నటి ప్రియాంక జైన్‌తో రియల్‌ లైఫ్‌లోనూ ప్రేమలో పడ్డాడు. కొన్నేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు, ప్రస్తుతం కలిసే ఉంటున్నారు. ప్రియాంక ఆల్‌రెడీ తెలుగు బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లో పాల్గొని మరింత పాపులారిటీ తెచ్చుకుంది. దీంతో రాబోయే బిగ్‌బాస్‌ సీజన్లలో ఆమె ప్రియుడు శివకుమార్‌ ఉండటం ఖాయమని అభిమానులు ఫీలవుతున్నారు.

ప్రియాంకజైన్‌తో శివకుమార్‌

తండ్రి కర్కశత్వం
పైకి ఎప్పుడూ నవ్వుతూ కనిపించే శివకుమార్‌ బాల్యంలో మాత్రం తండ్రి ప్రేమకు నోచుకోలేదు. ప్రేమను పంచాల్సిన తండ్రి బాధ పెడుతుంటే తట్టుకోలేకపోయాడు. ఆ విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. శివకుమార్‌ మాట్లాడుతూ.. మా అమ్మ స్కూల్‌ టీచర్‌. సాయంత్రం 5 తర్వాత అరగంట ఆలస్యంగా వస్తే చాలు అమ్మపై నాన్న కోప్పడేవాడు. ఎవడితో తిరుగుతున్నావ్‌? అని నీచంగా మాట్లాడేవాడు. అమ్మను కొట్టేవాడు. 

రూ.20 కోసం పెద్ద గొడవ
ప్రతిరోజు ఇదంతా చూసి అలిసిపోయాను. ఆయన ప్రవర్తనకు విసిగిపోయాను. ఆయన మందు తాగుతాడు, గుట్కా నములుతాడు, ఎన్నో ఎఫైర్స్‌ ఉన్నాయి. మా నాన్నను చూశాక మా చెల్లికి అబ్బాయిలంటేనే విరక్తి వచ్చేసింది. ఒకరోజు ఏమైందంటే.. మా నాన్న జేబులో రూ.20 కనిపించలేదు. ఆయనే ఎక్కడో తాగినచోట ఖర్చు చేసుంటాడు.  నేనే తీశానని నాపై నింద వేశాడు. ఆయన చేసిన గొడవకు ఊరంతా మా ఇంటి ముందుకొచ్చింది. 

కుటుంబమంతా చనిపోదామని..
కేవలం రూ.20 కోసం అంత పెద్ద గొడవ! ఈ జీవితమే వద్దు అని చచ్చిపోవాలనుకున్నా.. నాతోపాటు అమ్మ, చెల్లిపై కిరోసిన్‌ గుమ్మరించాను. అగ్గిపుల్ల వెలిగించేలోపు అమ్మ స్టూడెంట్‌ ఒకరు మమ్మల్ని బయటకు తీసుకెళ్లి కాపాడారు. ఆరోజు గనక తను ఆపకపోయుంటే ఈరోజు శివకుమార్‌ మీ ముందుండేవాడు కాదు. ఎవరినైనా మంచి తండ్రిని చూసినప్పుడు నాకెందుకు ఇలాంటి నాన్న లేడని బాధపడేవాడిని. నాన్న ప్రేమను పొందలేకపోయాను. ఇలాంటి వ్యక్తితో ఇంకా ఎందుకు కలిసుండటం? విడాకులు ఇచ్చేయమని అమ్మతో అనేవాడిని. ఇన్నాళ్లకు వాళ్లిద్దరికీ విడాకులు ఇప్పిస్తున్నాను అని శివకుమార్‌ ఎమోషనలయ్యాడు.

NOTE: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

చదవండి: పాతిక వేల సాయం.. దాని విలువ ఇప్పుడు రూ.5 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement