Kodali Bosubabu: దాసరి నారాయణరావు బంధువు, నిర్మాత బోసుబాబు కన్నుమూత

Senior Producer Kodali Bosubabu Died Of Heart Attack - Sakshi

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్‌ నిర్మాత కొడాలి బోసుబాబు కన్నుమూశారు. ఈయనకు భార్య, నలుగురు పిల్లలు. గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. దివంగత దాసరి నారాయణరావుకు ఈయన బంధువు అవుతారు. దాసరి పద్మకు సోదరుడి వరుస. తొలుత దాసరి సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్‌గా పని చేసిన బోసుబాబు ఆ తర్వాత నిర్మాతగా మారారు.

అక్కినేని నాగేశ్వరరావుతో 'రాగదీపం', నాగేశ్వరరావు, కృష్ణలతో 'ఊరంతా సంక్రాంతి', కృష్ణతో 'ప్రజాప్రతినిధి', శోభన్ బాబుతో 'జీవనరాగం', దాసరి నారాయణరావుతో 'పోలీస్ వెంకటస్వామి' వంటి చిత్రాలను నిర్మించారు. బోసుబాబు మృతి పట్ల  పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: గీతా ఆర్ట్స్‌ ముందు అర్ధ నగ్నంగా నటి ధర్నా 
ప్రశాంత్‌ నీల్‌, ఎన్టీఆర్‌ మూవీకి డేట్‌ ఫిక్స్‌, ఆ రోజే లాంచ్‌! 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top