సీనియర్ హీరో సుమన్ ప్రధాన పాత్రలో ‘త్రిష’

Senior Hero Suman to play lead role  in Trisha Movie - Sakshi

పాటల రికార్డింగ్తో సినిమాకు శ్రీకారం చుట్టడం అనే సంప్రదాయానికి ఇటివల మెగాస్టార్ చిరంజీవి జీవం పోయడం తెలిసిందే. తాను నటిస్తున్న 156వ చిత్రాన్ని కీరవాణి సారథ్యంలో పాటల రికార్డింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు మెగాస్టార్ చిరంజీవి. అదే బాటలో యువ దర్శకుడు ఆర్.కె గాంధీ తన తాజా చిత్రాన్ని ప్రారంభించారు. సీనియర్ హీరో సుమన్ ప్రధానపాత్రలో  నటిస్తున్న ఈ చిత్రానికి  'త్రిష'అని నామకరణం చేశారు. 'సంభవామి యుగే యుగే' అన్నది ఈ చిత్రం ఉపశీర్షిక.

స్నేహాలయం క్రియేషన్స్- బి.ఆర్ మూవీస్ పతకాలపై రవీంద్ర బూసం - ఈశ్వర్ నాగనాధ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యువ సంగీత సంచలనం ఎం.ఎల్.రాజా సంగీతంతోపాటు సాహిత్యం సైతం సమకూర్చుతున్నారు. "త్రిష" చిత్రం కోసం యువగాయకుడు సాయి చరణ్ ఆలపించిన గీతాన్ని అభేరి స్టుడియోలో గురువారం రికార్డింగ్ చేశారు. ఈ నెల 14 నుంచి  హైదరాబాద్ లో  రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్న 'త్రిష' కర్ణాటకలోను కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకోనుంది.

ఒక దివ్యాంశ సంభూతుడు దుష్టశక్తులను, దుష్టపన్నాగాలను ఎలా అరికట్టాడు అనే కథాంశంతో తెరకెక్కుతన్న ఈ చిత్రంలో కాలకేయ ప్రభాకర్, సురేష్ సూర్య, ఖుషీ గౌడ్, యువీన, కృష్ణేంద్ర, ధీరజ్ అప్పాజీ, ఆనంద్ మట్ట ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top