వైరల్‌గా మారిన సయాని, షారుక్‌ ట్వీట్స్‌

Sayani Gupta Tells Off Shah Rukh Khan Speaks up for Dalits - Sakshi

మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా షారుక్‌ ఖాన్‌ చేసిన ఓ ట్వీట్‌ ప్రస్తుతం వివాదానికి కారణమయ్యింది. ఈ ట్వీట్‌పై ఫోర్‌ మోర్‌ షాట్స్‌ ఫేమ్‌ నటి సయాని గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు సరైన విషయాలు బోధించాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకు విషయం ఏంటంటే గాంధీ జయంతి సందర్భంగా షారుక్‌ ఖాన్‌ ‘ఈ సమయంలో మన పిల్లలకు ఒకే ఆదర్శం బోధించాలి. అది ఏంటంటే మంచి, చెడు అన్ని వేళలా పిల్లలు చెడు వినకూడదు.. చూడకూడదు.. మాట్లాడకూడదు. 151వ జయంతి సందర్భంగా గాంధీ విలువలను స్మరించుకోవాలి’ అంటూ ట్వీట్‌ చేశారు షారుక్‌ ఖాన్‌. (చదవండి: ద‌ద్ద‌మ్మ‌ల్లారా, నేను అన్న‌దాంట్లో త‌ప్పేముంది)

దీనిపై సయాని గుప్తా స్పందించారు. ‘పిల్లలకు మంచి విషయాల గురించి చెప్పండి. సత్యం కోసం మాట్లాడమని గాంధీ మనకు బోధించారు. అణగారిని, దోపిడికి గురయిన మన దళిత సోదరులు, సోదరీమణుల గురించి మాట్లాడండి. మీ కళ్లను, నోటిని మూసుకోకండి.. సత్యం కోసం మాట్లాడండి’ అంటూ ఘాటుగా ట్వీట్‌ చేశారు సయాని గుప్తా. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్‌లు తెగ ట్రెంఢ్‌ అవుతున్నాయి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top