స‌ల్మాన్ ఫ్యాన్స్‌పై సింగ‌ర్ ఫైర్‌

Amaal Mallik Blast Trolls: Dont Expect Me To Stay Quiet - Sakshi

సంగీత ద‌ర్శ‌కుడు, సింగ‌ర్ అమ‌ల్ మాలిక్ త‌న‌కు హీరో షారుక్ ఖాన్ అంటే ఎంతో ఇష్ట‌మ‌ని ప్ర‌క‌టించారు. అంటే.. నీకు భాయ్‌జాన్ స‌ల్మాన్ ఖాన్ అంటే ఇష్టం లేదా అంటూ ఆయ‌న అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అత‌డిపై వేధింపుల‌కు పాల్ప‌డుతున్నారు. చంపేస్తామంటూ బెదిరింపుల‌కు దిగుతున్నారు. దీనిపై ఓపిక న‌శించిన అమ‌ల్ సోమ‌వారం ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా ట్రోలింగ్‌పై స్పందించారు. "ప్రియ‌మైన వెర్రివాళ్లారా.. మీరు నా ప్రొఫైల్‌కు వ‌చ్చి వేధించ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు. ఎందుకంటే నేను సల్మాన్ ఖాన్‌కు గౌర‌వం ఇవ్వ‌డం లేద‌ని మీరు భావిస్తున్నారు. నేను ఎప్ప‌టి నుంచో ఆయ‌న‌కు రుణ‌ప‌డి ఉన్నాను. అత‌నో సూపర్ స్టార్‌, బెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ కూడా. కానీ నా చిన్న‌ప్ప‌టి నుంచే నాకు షారుక్ అంటే ఇష్టం. ఇందులో త‌ప్పేముందో తెలుసుకోవ‌చ్చా. దీన్ని ప‌ట్టుకుని న‌న్ను, నా కుటుంబాన్ని ల‌క్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నారు. (హిందీలోకి దూకుడు)

చంపుతాం అని బెదిరించే అభిమానులు ఉంటే ఏ హీరో మాత్రం సంతోషప‌డ‌తారు? ఇంత ఘోరంగా ట్రోల్ చేయ‌డం చూసి నేను నిజంగా షాక్ అవుతున్నా. చ‌దువు రాని ద‌ద్ద‌మ్మ‌లు న‌న్ను ఆత్మ‌హ‌త్య చేసుకుని చ‌చ్చిపోమంటున్నారు. ఇలాగేనా మీ ఫేవ‌రెట్ హీరోకు మ‌ద్ద‌తు చేసే విధానం. ఇది మాన‌వ‌త్వం అనిపించుకుంటుందా? ఇంత విషం చిమ్ముతుంటే ఎవ‌రు మాత్రం ఓపిక ప‌ట్ట‌గ‌ల‌రు? న‌న్ను, నా కుటుంబాన్ని, నా అభిమానుల‌ను ఏమైనా చేస్తారేమోన‌ని నేను భ‌యంతో మౌనంగా ఉంటాన‌ని ఎంత‌మాత్రం అనుకోవ‌ద్దు. నా వాళ్ల జోలికి ఎవ‌రినీ రానివ్వ‌ను. నా నిర్ణ‌యాలు కూడా త‌మ‌రే డిసైడ్ చేయాల‌నుకున్న చ‌దువు సంధ్యా లేని మ‌నుషుల్లారా! ఈ సందేశం మీ అంద‌రికీ చేరుతుంద‌నుకుంటున్నా.." అని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. (రామ మందిరానికి షారుక్ రూ.5 కోట్ల విరాళం?)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top