Samantha Level Up Challenge: stylist Preetham Jukalker Epic Failure Deets Inside - Sakshi
Sakshi News home page

Samantha Ruth Prabhu: సమంత ఛాలెంజ్‌, ఓడిపోయిన ప్రీతమ్‌

Jan 12 2022 9:15 AM | Updated on Jan 12 2022 10:38 AM

Samantha Level Up Challenge: Preetham Jukalker Epic Failure - Sakshi

ఫిట్‌నెస్‌ మీద ఎక్కువ దృష్టిపెట్టేవాళ్లలో హీరోయిన్‌ సమంత ఒకరు. అందుకే ఎప్పుడు చూసినా ఆమె జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తూ చెమటలు చిందిస్తుంటుంది. తాజాగా సామ్‌ లెవల్‌ అప్‌ అనే కొత్త వర్కవుట్‌ ఛాలెంజ్‌ను విసిరింది. అంతేకాదు, ముందుగా ఆమె ఆ ఛాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేసి దానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేసింది. ఈ లెవల్‌ అప్‌ వర్కవుట్‌ ఛాలెంజ్‌ను సామ్‌ స్నేహితులు హెయిర్ స్టైలిస్ట్ రోహిత్ భట్కర్, మేకప్ ఆర్టిస్ట్ రంభియా, ప్రీతమ్ జుకల్కర్‌లు ట్రై చేశారు.

రోహిత్‌ ఈ ఛాలెంజ్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయగా రంభియా మాత్రం వెల్లకిలా పడిపోయింది. ఇక ప్రీతమ్‌ అయితే ముందుకు పడటంతో సామ్‌ నవ్వాపుకోలేకపోయింది. నేను ఎంకరేజ్‌ చేద్దామనుకున్నా.. కానీ ప్రీతమ్‌ వల్ల కావడం లేదు, ఓడిపోయాడు అని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే వరుస ప్రాజెక్టులతో దూకుడు మీదున్న సామ్‌ హాలీవుడ్‌ మూవీ 'అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌'లో బై-సెక్సువల్‌ యువతి పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement