
ఇటీవల కాస్త కోలుకున్న సమంత ఆరోగ్యం మళ్లీ తిరగబెట్టిందనే ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా సమంత సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని ఆమె శ్రేయోభిలాషులు, అభిమా
మనిషికి ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. అయితే ఒక్కోసారి కోట్ల ఆస్తి ఉన్నా ఇష్టమైన పనికానీ, ఇష్టమైన ఆహారం కానీ తీసుకోలేం. హీరోయిన్ సమంత విషయంలోనూ ఇదే జరుగుతోంది. హీరోయిన్‌గా అగ్రస్థానంలో కొనసాగుతున్న సమంత అనూహ్యంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైన విషయం తెలిసిందే. దీంతో ఈమె నటనను తాత్కాలికంగా పక్కన పెట్టి ఆరోగ్యాన్ని చక్కపెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం అమెరికాలో చికిత్స పొందుతున్నారు.
ఈమె గురించి ఇప్పటికే రకరకాల ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాస్త కోలుకున్న సమంత ఆరోగ్యం మళ్లీ తిరగబెట్టిందనే ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా సమంత సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని ఆమె శ్రేయోభిలాషులు, అభిమానులు కోరుకుంటున్నారు. కాగా తన ఆరోగ్యం విషయంలో సమంత ఇటీవల ఆహార వ్యవహారాల్లో మార్పులు చేసుకున్నారట. ముఖ్యంగా వైద్యుల సలహా మేరకు నచ్చిన ఆహారాన్ని దూరంగా పెట్టినట్లు సమాచారం.
ముఖ్యంగా నట్స్, బంగాళాదుంప, టమాట, గుడ్లు, పాలు వంటి పదార్థాలను పక్కన పెట్టారట. బ్రెడ్, బట్టర్, జామ్ అంటే సమంతకు చాలా ఇష్టం అట. దాన్ని కూడా అయిష్టంగానే పక్కన పెట్టిన సమంత చాలా రోజుల తరువాత ఇప్పుడు తనకు ఇష్టమైన బ్రెడ్, బట్టర్, జామ్‌ను ఆహారంగా తీసుకుంటున్నారట. దీని గురించి ఆమె తన ఇన్‌స్ట్రాగామ్‌లో పేర్కొన్నారు. అంటే సమంత ఆరోగ్యం కోలుకుంటున్నట్లే అని ఆమె అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.