Salman Khan: మాజీ లవర్‌ను ముద్దాడిన సల్మాన్ ఖాన్.. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్

Salman Khan kissing Sangeeta Bijlani at Bhai Ka Birthday Party - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ ఇవాళ 57వ బర్త్ డే జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సోదరి అర్పితా ఖాన్‌ నివాసంలో సల్లు భాయ్ బర్త్‌డే పార్టీ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో బాలీవుడ్ తారలు సందడి చేశారు. బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ కూడా సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. అయితే ఈ వేడుకల్లో  సల్మాన్ చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్న ఆయన మాజీ లవర్‌ సంగీతా బిజ్‌లానీతో కాసేపు మాట్లాడారు. ఆ తర్వాత ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరలైంది. 

(ఇది చదవండి: సల్మాన్‌ బర్త్‌డే పార్టీకి హాజరైన షారుక్‌ఖాన్‌.. ఫోటోలు వైరల్‌)

దీంతో సంగీతా పట్ల సల్మాన్ చూపిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సంగీత కారు ఎక్కుతుండగా తానే డోర్ తీసి ఆమెను సాగనంపారు. సల్మాన్ చేసిన పనికి ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేశారు. ఇక ఆ పార్టీలో జాన్వీకపూర్‌, పూజా హెగ్డే, టబు, సునీల్ శెట్టి, రితేశ్ దేశ్‌ముఖ్, జెనీలియా, సోనాక్షి సిన్హా, కార్తీక్ ‌ఆర్యన్‌ సహా పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలయ్యాయి.

కాగా.. మైనే ప్యార్ కియా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సల్మాన్‌ ఖాన్‌ ఆ తర్వాత హమ్ ఆప్కే హై కౌన్, బీవీ నెం.1,  కుచ్ కుచ్ హోతా హై వంటి సినిమాలతో స్టార్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు. ప్రస్తుతం సినిమాలతో పాటు బుల్లితెరపై బిగ్‌బాస్‌ షోకు హోస్ట్‌ గానూ కొనసాగుతున్నారు.
 

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top