breaking news
salman khan sister
-
సల్లు భాయ్ బర్త్‌డే పార్టీ.. మాజీ లవర్‌ను ముద్దాడిన హీరో
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ ఇవాళ 57వ బర్త్ డే జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సోదరి అర్పితా ఖాన్ నివాసంలో సల్లు భాయ్ బర్త్‌డే పార్టీ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో బాలీవుడ్ తారలు సందడి చేశారు. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కూడా సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. అయితే ఈ వేడుకల్లో సల్మాన్ చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్న ఆయన మాజీ లవర్ సంగీతా బిజ్లానీతో కాసేపు మాట్లాడారు. ఆ తర్వాత ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరలైంది. (ఇది చదవండి: సల్మాన్ బర్త్‌డే పార్టీకి హాజరైన షారుక్‌ఖాన్.. ఫోటోలు వైరల్) దీంతో సంగీతా పట్ల సల్మాన్ చూపిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సంగీత కారు ఎక్కుతుండగా తానే డోర్ తీసి ఆమెను సాగనంపారు. సల్మాన్ చేసిన పనికి ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేశారు. ఇక ఆ పార్టీలో జాన్వీకపూర్, పూజా హెగ్డే, టబు, సునీల్ శెట్టి, రితేశ్ దేశ్‌ముఖ్, జెనీలియా, సోనాక్షి సిన్హా, కార్తీక్ ఆర్యన్ సహా పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలయ్యాయి. కాగా.. మైనే ప్యార్ కియా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సల్మాన్ ఖాన్ ఆ తర్వాత హమ్ ఆప్కే హై కౌన్, బీవీ నెం.1, కుచ్ కుచ్ హోతా హై వంటి సినిమాలతో స్టార్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు. ప్రస్తుతం సినిమాలతో పాటు బుల్లితెరపై బిగ్‌బాస్ షోకు హోస్ట్ గానూ కొనసాగుతున్నారు. View this post on Instagram A post shared by Pinkvilla (@pinkvilla) -
సల్మాన్‌కు శిక్ష.. ఆ బాధ వారికే ఎక్కువ
సల్మాన్ ఖాన్ కృష్ణజింకలను వేటాడిన కేసులో జోధ్‌పూర్ కోర్టు ఊహించని తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో అభిమానులు కంగుతిన్నారు. అయితే సల్మాన్‌కు జైలు శిక్ష విషయంలో అందరికంటే ఎక్కువగా బాధకు గురైంది సల్మాన్ చెల్లెల్లు అల్విరా, అర్పితా ఖాన్. తీర్పు వెలివడిన వెంటనే వీరు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కోర్టు విరామ సమయంలో కూడా వారు బయటకు వెళ్లకుండా అక్కడే కూర్చున్నారు. జడ్జి ఐదేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. సల్మాన్ మాత్రం నేను నిర్దోషినంటూ జడ్జికి పదేపదే విన్నవించుకున్నారు. సల్మాన్ తరుపు లాయర్కూడా ఈ తీర్పుపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఐదేళ్లు శిక్ష విధిస్తారని తాము ఊహించలేదని తెలిపారు. ఇప్పటికే బెయిల్ కోసం కోర్టు ను ఆశ్రయించినట్టుగా తెలిపారు. ఈ పిటిషన్‌పై ఈ రోజు(శుక్రవారం) విచారణ జరగనుంది. ప్రస్తుతం సల్మాన్ మీద వందల కోట్ల రూపాయల బిజినెస్ ఆధారపడి ఉంది. ఇటీవల రేస్ 3 షూటింగ్ ను పూర్తి చేసిన సల్లూభాయ్ భరత్, దబాంగ్ 3లలో నటించేందుకు అంగీకరించాడు. ఈ సినిమాలకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. సల్మాన్‌కు శిక్ష పడటంతో ఈ చిత్రాల భవిష్యత్తు సందిగ్థంలో పడింది. సల్మాన్‌కు బెయిల్ రాకపోతే నిర్మాతలు వందల కోట్ల నష్ట కలుగుతుందంటున్నారు విశ్లేషకులు. -
అదిరె.. కళ్లు చెదిరె..
అంగరంగ వైభవంగాసల్మాన్ఖాన్ సోదరి వివాహం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఘనంగా వేడుక అర్పితాఖాన్, ఆయుష్ శర్మ జంటను ఆశీర్వదించిన అతిథులు హాజరైన అమితాబ్, రజనీకాంత్, ఆమిర్, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, కత్రినా సాక్షి, హైదరాబాద్: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ సోదరి అర్పితాఖాన్ వివాహం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. బాలీవుడ్ తారల సందడితో హైదరాబాద్‌లోని చారిత్రక తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్ మరింత మెరిసిపోయింది. సర్వాంగ సుందరంగా ముస్తాబైన ప్యాలెస్‌లో అంతకంటే ముచ్చటగా తయారైన పెళ్లి జంట అందరినీ ఆకట్టుకుంది. సాయంత్రం నాలుగున్నర గంటలకు వివాహ మహోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. పెళ్లి కుమారుడు ఆయుష్ శర్మ బ్యాండ్ బాజాలతో గుర్రంపై బారాత్‌గా పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నారు. వధువు తండ్రి సలీంఖాన్, తల్లి సల్మాఖాన్, సోదరులు సల్మాన్‌ఖాన్, అర్బాజ్‌ఖాన్, సొహేల్ఖాన్ ఇతర కుటుంబ సభ్యులు వరుడికి ఘన స్వాగతం పలికారు. అనంతరం పంజాబీ సంప్రదాయ పద్ధతిలో అర్పిత, ఆయుష్ శర్మ వివాహం జరిగింది. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, అగ్రనటులు ఆమిర్‌ఖాన్, చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, కత్రినాైకైఫ్, కాజల్, కరణ్ జోహార్, బాబాసెహగల్తో పాటు క్రికెటర్ అజారుద్దీన్ వంటి సుమారు 250 మంది ప్రముఖులు ఈ వివాహానికి తరలివచ్చారు. ప్రత్యేక ఆహ్వానితులంతా వధూవరులను ఆశీర్వదించారు. వారందరికీ సల్మాన్‌ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు. నిజాం వంటకాలతో విందు పెళ్లి విందులో నిజాం వంటకాలను అతిథులంతా పసందుగా ఆరగించారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లోని 101 సీట్ల డైనింగ్హల్లో దక్కన్ బిర్యానీ, హలీమ్, పత్తార్కా ఘోష్, డబల్కా మీఠా తదితర వంటకాలు వడ్డించారు. విందు అనంతరం ప్రసిద్ధ కళాకారుల కళా ప్రదర్శనలు కొనసాగాయి. పంజాబ్‌కు చెందిన ప్రముఖ గాయకుడు మైకా, యోయో హోనిసింగ్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఫలక్‌నుమాలో సందడి అర్పిత వివాహం సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలోని ఫలక్‌నుమా ప్రాంతంలో పెళ్లి సందడి నెలకొంది. ఉదయం నుంచే సల్మాన్ ఖాన్ బంధుమిత్రులు, అతిథుల రాకతో హడావుడిగా మారింది. మీడియాను ప్యాలెస్ ప్రధాన గేటు వద్దే నిలిపివేశారు. దీంతో వారంతా ఉదయం నుంచి రాత్రి వరకు రోడ్డుపైనే పడిగాపులు కాయాల్సివచ్చింది. మద్యాహ్నం రెండు గంటల ప్రాంత ంలో సల్మాన్ ఖాన్ ప్యాలెస్‌కు చేరుకున్నారు. వివాహానంతరం రాత్రి ఎనిమిది గంటలకు ఇద్దరు ఫొటోగ్రాఫర్లు, ఇద్దరు వీడియో గ్రాఫర్లను అనుమతించారు. ఇక భారీ సంఖ్యలో అభిమానులు కూడా ప్యాలెస్ వద్దకు రావడంతో వారిని కట్టడి చేసేందుకు పోలీసులు నానా అవస్థలు పడ్డారు. రంగురంగుల విద్యుల్లతలతో ఫలక్‌నుమా ప్యాలెస్ జిగేల్మంది. బుధవారం పెళ్లి విందుతో వివాహ వేడుక ముగియనుంది. ఫూట్‌పాత్‌పై నుంచి ప్యాలెస్ వరకు.. దిక్కుమొక్కు లేక రోడ్డు పక్కన పూట్పాత్పై లభించిన అనాథ బాలికను అల్లారుముద్దుగా యువరాణిలా పెంచింది సల్మాన్ ఖాన్ కుటుంబం. ఇప్పుడు ఆ అమ్మాయి కోసమే కోట్లు కుమ్మరించి మరీ చారిత్రక ఫలక్‌నుమా ప్యాలెస్‌లో వివాహం జరిపించింది. యాక్సిడెంట్లో తల్లి మృతి చెందడంతో అనాథగా రోడ్డుపక్కన పడి ఉన్న బాలిక అర్పితను సల్మాన్‌ఖాన్ తండ్రి సలీమ్‌ఖాన్ అక్కున చేర్చుకున్నారు. ఆమెను దత్తత తీసుకుని యువరాణిలా పెంచారు. అర్మితకు తన వివాహం ప్యాలెస్‌లో జరగాలని కోరిక. దీంతో ఆమె కోరికను తీర్చేందుకే సల్మాన్ కుటుంబం సుమారు రూ. 2 కోట్లు ఖర్చుచేసింది. ఆరు నెలల క్రితమే ఫలక్‌నుమా ప్యాలెస్‌ను బుక్ చేశారు. ఇక ముంబైలోని కార్టర్రోడ్డులో సుమారు రూ. 16 కోట్ల విలువైన మూడు పడక గదుల ఫ్లాట్‌ను సల్మాన్‌ఖాన్ తన సోదరికి పెళ్లి బహుమతిగా ఇచ్చారు. లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్లో అర్పిత డిగ్రీ చదివారు. ఇటీవలే ఆమె సొంతంగా ఓ ఫ్యాషన్ లేబుల్‌ను లాంచ్ చేసింది. -
సల్మాన్ ఖాన్ సోదరి పెళ్లి
-
సలాం సల్మాన్
-
వెడ్డింగ్ ప్యాలస్