కర్మ ఎవరినీ వదిలిపెట్టదంటూ వారిపై 'రేణూ దేశాయ్' ఫైర్ | Renu Desai Comments On Pawan Kalyan Fans | Sakshi
Sakshi News home page

ఆయన మరో పెళ్లి చేసుకుంటే నన్ను ఎందుకు తప్పుబడుతున్నారు: రేణూ దేశాయ్‌

Published Tue, Jun 25 2024 10:03 AM | Last Updated on Tue, Jun 25 2024 3:53 PM

Renu Desai Comments On Pawan Kalyan Fans

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి ప్రముఖ హీరో పవన్‌ కల్యాణ్‌ అభిమానులతో రేణూ దేశాయ్‌ పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయాన్ని కొన్ని వందల సార్లు వారి చేష్టల గురించి ఆమె బహిరంగంగానే చెప్పారు. అయినా వారిలో ఎలాంటి మార్పులు రాలేదు. కొద్దిరోజుల క్రితం వచ్చిన ఎన్నికల ఫలితాల్లో పవన్‌ గెలుపొందటంతో ఆయన అభిమానులు రేణూ ఇన్‌స్టా కామెంట్‌ బాక్స్‌లో అనేక మెసేజ్‌లు చేశారు.  

తనని దురదృష్టవంతురాలని వారు కామెంట్‌ చేయడంతో ఆమె చాలా బాధ పడ్డారు. అలాంటి మెసేజ్‌లు తనకు చాలా బాధ కలిగిస్తున్నాయని, అలా పిలవొద్దని చెప్పి చెప్పి అలసిపోతున్నానంటూ  రేణు దేశాయ్‌ అన్నారు. పవన్‌ కల్యాణ్‌ నుంచి విడాకులు తీసుకున్న దగ్గరి నుంచి ఆయన అభిమానులతో ఆమె పెద్ద యుద్ధమే చేస్తున్నారు. గతంలో ఓ దశలో ఈ వ్యవహారం తారస్థాయికి చేరడంతో ఆమె కామెంట్‌ సెక్షన్‌ కూడా హైడ్‌ చేశారు. 

వారి తాకిడికి తట్టుకోలేకనే ఇలాంటి పనిచేసినట్లు కూడా ఆమె తెలిపారు. ఇంత జరుగుతున్నా కూడా పవన్‌ కల్యాణ్‌ తన అభిమానులకు అడ్డుకట్ట వేసేందుకు ఒక సూచన అయినా ఇవ్వకపోవడం బాధాకరం. తాజాగా మరోసారి తన ఇన్‌స్టాగ్రామ్‌ కామెంట్ల సెక్షన్‌ను క్లోజ్‌ చేస్తున్నట్లు రేణూ దేశాయ్‌ తెలిపారు. ఈ క్రమంలో ఆమె ఇలా చెప్పుకొచ్చారు.

కర్మ ఎవరినీ వదలదు.. కామెంట్‌ సెక్షన్‌కు గుడ్‌బై
'ఇప్పటి నుంచి నా ఇన్‌స్టాగ్రామ్‌ కామెంట్‌ సెక్షన్‌ను ఆఫ్ చేస్తున్నాను. ఎందుకంటే నా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లలో చెత్త కామెంట్లు పెట్టే మూర్ఖులు, వెధవలకు తిరిగి సమాధానం ఇచ్చే అంత ఓపిక నాకు లేదు. అంతేకాకుండా వాటిని ఎదుర్కొనే అంత భావోద్వేగం నాలో లేదు. అయితే, నేను బాధలో ఉన్నప్పుడు కొన్నేళ్లుగా నాకు తోడుగా ఉన్న వారందరికీ నా ధన్యవాదాలు. నన్ను ద్వేషించేవారు గుర్తుపెట్టుకోండి నేను మీకు ఒకటే చెబుతున్నా.. కర్మ అనేది ఒకటి ఉంది అనే విషయాన్ని మరిచిపోకండి. అది ఎప్పటికీ కామ్‌గా ఉండదు. ఖచ్చితంగా మీ కోసం తిరిగి వస్తుంది.' అని రేణూ దేశాయ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు.

రేణూ దేశాయ్‌ ఒక కొటేషన్‌ను కూడా పంచుకున్నారు. 'మీరు చూస్తున్నది అంతా సమస్య కాదని ఏదో ఒకరోజు తెలుసుకుంటారు. అవును, మీరు తప్పు చేస్తున్నారు. ఎందుకంటే మీరు కూడా మనుషులే కదా..! ఆ తప్పుల నుంచి ఎదుగుతాం కదా.. ప్రేమతో మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మీ మనసుల్ని గాయపరిచే అవకాశం ఈ  ప్రపంచానికి ఇవ్వకండి.' అంటూ రేణు తెలిపారు.

ఆయన వేరే పెళ్లి చేసుకుంటే నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు..?
పవన్‌ కల్యాణ్‌ కూటమి ద్వారా ఎన్నికల్లో గెలిచారు. ఆపై ఆయనకు డిప్యూటీ సీఎం పదవిని చంద్రబాబు కట్టబెట్టడం కూడా జరిగిపోయింది. దీంతో ఫుల్‌ జోష్‌లో ఉన్న పవన్‌ అభిమానులు రేణూ దేశాయ్‌ మీద మెసేజ్‌లతో ఇలా విరుచుకపడ్డారు.  'మీరు దురదృష్టవంతురాలు మేడమ్‌' అంటూ వ్యంగ్యంగా కామెంట్‌ చేశారు. దీనికి రేణూ దేశాయ్‌ స్పందిస్తూ 'నేను ఎలా దురదృష్టవంతురాలినో చెప్పండి అంటూనే.. నేను ఆయన్ను (పవన్‌) వదిలేయలేదు.. ఆయనే నన్ను వదిలేశారంటూ' కౌంటర్‌ ఇచ్చారు. 

కొన్నేళ్లుగా దురదృష్టవంతురాలు అనే మాట తనను ఎంతగానో బాధపెడుతుందని ఆమె ఇలా చెప్పుకొచ్చారు. 'నా భర్త నన్ను వదిలేసి, వేరే పెళ్లి చేసుకుంటే..  నా తప్పు ఎందుకు అవుతుంది..? కొన్నేళ్లుగా ఇలాంటి కామెంట్లతో యుద్ధమే చేస్తున్నాను. అలాంటి మాటలు విని నాకు విసిగొస్తుంది. నా అదృష్టాన్ని కేవలం ఒక వ్యక్తితో మీరందరూ ఎందుకు ముడిపెడుతున్నారు..? విడాకులు తీసుకున్న వారు ఎవరూ (స్త్రీ, పురుషులు) దురదృష్టవంతులు కాదని తెలుసుకుంటే చాలు.' అని రేణూ దేశాయ్ అన్నారు.  ఆస్క్రీన్‌ షాట్‌లను కూడా ఆమె పంచుకున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement