
Ram Charan Wears Richard Mille Watch At RC15 Launch: సెలబ్రిటీలు ధరించే దుస్తులు, వాచ్‌ల దగ్గర్నుంచి వేసుకునే బ్యాగులు, చెప్పుల వరకు దాదాపు అన్ని కాస్ట్‌లీగానే ఉంటాయి. దీంతో సాధారణంగా వాటి ధరెంతో తెలుసుకోవాలని అభిమానులు తెగ ఆరాటపడుతుంటారు. తాజాగా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు సంబంధించి హైదరాబాద్‌లో పూజా కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమానికి చిరంజీవి, ఎస్.ఎస్. రాజమౌళి,రణ్‌వీర్ సింగ్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో రామ్‌చరణ్ ధరించిన వాచీపైనే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది.రామ్‌చరణ్ ధరించిన వాచ్ మోడల్ ఏంటి? దాని ధరెంత అని సెర్చ్ చేయగా అది 'రిచర్డ్ మిల్లె RM 61-01 యోహన్ బ్లేక్ మోడల్' అని తెలిసింది.
ఒలంపిక్స్‌లో 100,200 మీటర్లలో ఫాస్టెస్ట్ రన్నర్‌గా ప్రపంచ రికార్డ్ సాధించిన యోహన్ బ్లేక్ కోసం 'రిచర్డ్ మిల్లే' కంపెనీవారు ఈ వాచ్‌ని స్పెషల్‌గా డిజైన్ చేశారు. అప్పటి నుంచి ఈ వాచ్‌కి డిమాండ్ బాగా పెరిగిపోయింది. బ్లాక్ కలర్ రబ్బర్ స్ట్రిప్ తో పాటు యల్లో, గ్రీన్ కాంబోతో డైల్ కలర్స్ రావడం ఈ వాచ్ కి మరింత గ్రాండ్ లుక్‌ను తీసుకువచ్చింది. వందశాతం వాటర్ రెసిప్టెన్సీ ఉన్న ఈ వాచ్ ధర 124500 యూరోలు. అంటే ఇండియన్ కరెన్సీలో అక్షరాలా రూ.1,02 కోట్లు అనమాట.
చదవండి : RC15: సూటుబూటు వేసుకొని స్టయిలిష్‌గా పోస్టర్
ఆర్‌సీ 15 పోస్టర్‌కు డైరెక్టర్ ఎంత ఖర్చు పెట్టించాడో తెలుసా!