
మాస్‌మహారాజా రవితేజ థియేటర్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఏషియన్ సినిమాస్ వారి భాగస్వామ్యంతో హైదరాబాద్లో లగ్జరీ మల్టీఫ్లెక్స్ను ఆయన నిర్మించారు. ఇప్పటికే మహేశ్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ఈ వ్యాపారంలో రాణిస్తున్నారు. తాజాగా రవితేజ్ కూడా ఆరు స్క్రీన్లతో వనస్థలిపురంలో మల్టీఫ్లెక్స్ను ఏర్పాటు చేశారు. జులై 31న ప్రారంభోత్సవం జరగనుంది.
ART (ఏషియన్ రవితేజ) మల్టీఫ్లెక్స్లో తొలి సినిమా 'కింగ్డమ్' ప్రదర్శించనున్నారు. ఇప్పటికే అందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తిచేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈస్ట్ హైదరాబాద్ ఏరియాలో అత్యంత లగ్జరీ థియేటర్గా ART నిలవనుంది. సుమారు 60 అడుగుల వెడల్పుతో భారీ స్క్రీన్.. ఆపై డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్తో పాటు సినిమా ప్రేమికులకు కొత్త అనుభూతిని అందించే విధంగా అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇప్పటికే టెస్టింగ్ ప్రక్రియ కూడా పూర్తి అయింది.

రవితేజ థియేటర్లో 'కింగ్డమ్' తొలి సినిమా కావడంతో విజయ్ దేవరకొండ అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ క్రమంలో వారిద్దరికీ కూడా శుభాకాంక్షలు చెబుతూ భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన కింగ్డమ్లో భాగ్య శ్రీ బోర్సే కథానాయిక. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.