మాస్‌ టైటిల్‌.. మైండ్‌ బ్లోయింగ్‌ లుక్‌

Ravi Teja and Sarath Mandava movie shooting postponed - Sakshi

రవితేజ హీరోగా శరత్‌ మండవ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ నెలాఖరున  ప్రారంభం కావాల్సిన ఈ సినిమా షూటింగ్‌ కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడింది. దీంతో ఈ చిత్రంలో ఫలానా హీరోయిన్‌ నటించనున్నారని, కథలో మార్పులు చేస్తున్నారని, షూటింగ్‌ ఇప్పట్లో మొదలు కాదనే వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే ఇలాంటి పుకార్లకు చెక్‌ పెట్టేలా ఈ చిత్రదర్శకుడు శరత్‌ మండవ సోషల్‌మీడియాలో స్పందించారు.

‘‘ఈ సినిమా టైటిల్‌ ఫుల్‌ మాస్‌గా, ఫస్ట్‌ లుక్‌ మైండ్‌బ్లోయింగ్‌గా ఉంటాయి. ఇక ఈ మూవీ థీమ్‌ సాంగ్‌ అయితే ఇప్పటివరకు ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది. వచ్చే నెలలో షూటింగ్‌ ఆరంభించే చాన్స్‌ ఉంది. ఆ తర్వాత మా సినిమా గురించి కొన్ని అప్‌డేట్స్‌ ఇస్తాం’’ అని పేర్కొన్నారు శరత్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top