షాకింగ్: ర్యాపర్‌ చెంప చెళ్లుమనిపించిన అభిమాని | Ramper Ice Spice Gets Slapped By Fan, Video Goes Viral | Sakshi
Sakshi News home page

షాకింగ్: ర్యాపర్‌ చెంప చెళ్లుమనిపించిన అభిమాని

Apr 19 2026 4:49 PM | Updated on Apr 19 2026 5:07 PM

Ramper Ice Spice Gets Slapped By Fan, Video Goes Viral

హాలీవుడ్‌ ప్రముఖ ర్యాపర్ ఐస్ స్పైస్‌కు చేదు అనుభవం ఎదురైంది. లాస్ ఏంజిల్స్‌లోని మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్‌లో ఆమెపై ఓ అభిమాని భౌతిక దాడికి పాల్పడటం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

హాలీవుడ్‌ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.., ఐస్ స్పైస్ తన స్నేహితురాలితో కలిసి మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్‌కి వెళ్లింది. అక్కడికి ఓ యువతి వచ్చి.. అభిమానిని అని మాట్లాడడం ప్రారంభించిది. మొదట సాధారణంగానే అనిపించినప్పటికీ, ఆ అభిమాని అతిగా ప్రవర్తిస్తూ ఐస్ స్పైస్‌ను అసౌకర్యానికి గురిచేసింది. దీంతో ఐస్ స్పైస్, ఆమె స్నేహితురాలు సదరు యువతిని తమ టేబుల్ వద్ద నుండి వెళ్ళిపోవాలని కోరారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి లోనైన ఆ అభిమాని ఒక్కసారిగా ఐస్ స్పైస్ చెంపపై కొట్టింది. ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా అదుపు తప్పి గందరగోళంగా మారింది.

చెంపదెబ్బ కొట్టిన తర్వాత ఆ అభిమానిని ఆమె స్నేహితుడు బయటకు లాక్కెళ్తుండగా, ఐస్ స్పైస్ వారిని వెంబడించింది. రెస్టారెంట్‌లోని బల్లలపై  దూకుతూ వెళ్లి ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నించింది. రెస్టారెంట్‌ డోర్‌ ముందు కూడా కాసేపు వాగ్వాదం జరిగింది. కోపంలో కింద పడిపోయిన ఒక ఫోన్‌ను ఐస్ స్పైస్ పగలగొట్టింది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న కొందరు తమ ఫోన్లలో చిత్రీకరించడంతో, అవి నెట్టింట వైరల్‌గా మారాయి. 

ఈ దాడి అకారణంగా జరిగిందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఐస్‌ స్పైస్‌ న్యాయవాది తెలిపారు. అయితే సదరు యువతి మాత్రం.. తన తప్పు ఏమి లేదన్నారు. అభిమానిగా కలిసేందుకు వెళ్తే.. ఐస్ స్పైస్ తనతో అమర్యాదగా ప్రవర్తించి, అభ్యంతరకర భాష వాడటం వల్లే తాను చేయి చేసుకోవాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement