టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు. ఆర్జీవీ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతోంది.
తాను విజయవాడలో ఇంజినీరింగ్ చదివే రోజుల్లో క్లాస్‌మేట్స్‌తో కలిసి దిగిన ఫోటోను రాంగోపాల్ వర్మ ట్విటర్‌లో షేర్ చేశారు. అందులో తాను ఎక్కడున్నానో కనిపెట్టాలంటూ నెటిజన్స్‌ను ప్రశ్నించారు. అయితే ఆ ఫోటోలో అందరి మొహాలు కాస్తా బ్లర్‌గా ఉన్నాయి. అందువల్లనే ఆడియన్స్‌కు ఆర్జీవీ చిన్న పరీక్ష పెట్టినట్లు తెలుస్తోంది.
కాగా.. రాంగోపాల్ వర్మ ప్రస్తుతం శారీ అనే మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గిరికృష్ణ కమల్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు ఆర్జీవీ వెల్లడించారు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ ఆరాధ్యదేవి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
Me with my friends sitting on a wall in my engineering days in Vijaywada..SPOT ME pic.twitter.com/gq7SFTb4UA
— Ram Gopal Varma (@RGVzoomin) August 11, 2024
Comments
Please login to add a commentAdd a comment