Ram Charan: నాన్న నన్ను తిట్టారు.. అలా అవమానిస్తున్నారేంటని ఉపాసన ఆశ్చర్యపోయింది

Ram Charan Reveals Dad Chiranjeevi Fat Shamed Him In Front Of Upasana - Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా సక్సెస్‌తో మంచి జోష్‌ మీదున్నాడు మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌. ఓ పక్క భారీ స్థాయిలో కలెక్షన్స్‌, మరోపక్క అవార్డులు రివార్డులు వస్తుండటంతో సంతోషంలో తేలిపోతున్నాడు. తాజాగా అతడు అంతర్జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'నటుడిగా 41 ఏళ్లుగా నాన్న సినిమాల్లోనే ఉన్నారు. కొన్ని విషయాల్లో తను స్ట్రిక్ట్‌గా ఉంటాడు. శరీరాకృతి కాస్త మారిందంటే చాలు అస్సలు ఊరుకోడు. డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చున్నప్పుడు బరువు తగ్గిపోయావేంట్రా.. అని నాన్న అంటే నిజమేననుకుని అవును డాడీ అని తలూపేవాడిని. వెంటనే ఆయన ఇడియట్‌.. నేనేదో సరదాగా అన్నాను. ఇప్పటికే నువ్వు చాలా బరువు పెరిగిపోయావు, అసలేమైనా పట్టించుకుంటున్నావా? ముందు జిమ్‌కెళ్లు అని ఫైర్‌ అయ్యేవారు. అది విని నా భార్య.. నిన్ను ఇలా అవమానిస్తున్నారేంటి? అని ఆశ్చర్యపోయేది. కానీ అది అవమానించడం కాదు, నటుల మధ్య సంభాషణ అలాగే ఉంటుందని చెప్పేవాడిని. 

చిన్నప్పటినుంచే నాకు నటనంటే ఇష్టం. నేను కాలేజీకి వెళ్లేవాడిని కానీ చదువుపై అంత ధ్యాస ఉండేదికాదు. నాన్న మాత్రం ఫస్ట్‌ చదువు పూర్తి చేయు, ఆ తర్వాత నీకు నచ్చింది చేయమని చెప్పేవారు. అలా ఇంట్రస్ట్‌ లేని చదువు దీర్ఘకాలంగా సాగుతూ ఉండటంతో ఓ రోజు మా డీన్‌ నాన్నకు ఫోన్‌ చేశారు. అతడికి ఏం చేయాలనిపిస్తే అది చేయనివ్వండి. అనవసరంగా మీ కొడుకు సమయాన్ని, నా సమయాన్ని వృధా చేయకండి అని కోరాడు. అలా నేను కాలేజీ నుంచి యాక్టింగ్‌ స్కూల్‌కు షిఫ్టయ్యాను' అని చెప్పుకొచ్చాడు చెర్రీ. కాగా చరణ్‌ చేతిలో ప్రస్తుతం ఆరు ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది.

చదవండి: నటుడితో లవ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌
చనిపోయినా పర్లేదు కానీ క్యాన్సర్‌కు చికిత్స తీసుకోను

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top