బన్నీకి అవార్డ్‌.. ఒకరోజు ఆలస్యంగా శుభాకాంక్షలు చెప్పిన రామ్‌ చరణ్‌ | National Film Awards 2023: Ram Charan Late Wishes To Allu Arjun On Best Actor Win - Sakshi
Sakshi News home page

Ram Charan: బన్నీకి జాతీయ అవార్డు.. లేట్‌గా విష్‌ చేసిన చరణ్‌

Aug 25 2023 2:20 PM | Updated on Aug 25 2023 3:07 PM

Ram Charan Late Wishes to Allu Arjun - Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌ డైరెక్టర్‌ రాజమౌళి పుష్ప.. తగ్గేదేలే అంటూ సినిమా స్టైల్‌లో కంగ్రాట్స్‌ చెప్పాడు. దీనికి బన్నీ థాంక్యూ అని రిప్లై ఇచ్చాడు. అటు ఎన్టీఆర్‌ అయితే నీకు ఈ అవార్డులు, విజయం వచ్చి తీరాల్సిందే అని ట్వీట్‌ చేశాడు. దీనికి బన్నీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్పినందుకు థ్యాంక్స్‌ బావా అంటూ రిప్లై ఇచ్చాడు. ఆర్‌ఆర్‌ఆ

ఎన్నో అవార్డులు వస్తాయి కానీ.. రాదీ అవార్డు అనుకున్నారంతా! మనకిక దక్కదేమో అనుకుంటున్న అవార్డును తన సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్‌. 69 ఏళ్లుగా ఊరిస్తూ ఉసూరుమనిపించిన ఉత్తమ నటుడి పురస్కారాన్ని బన్నీ తన వశం చేసుకున్నాడు. టాలీవుడ్‌ హీరోకు బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు వరించిందనగానే యావత్‌ తెలుగు ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేశారు. అటు బన్నీ సైతం కొద్ది క్షణాలపాటు షాక్‌లో ఉండిపోయాడు. కాసేపటికి షాక్‌ నుంచి తేరుకుని ఆనందంతో భార్యను హత్తుకుని తనపై ముద్దుల వర్షం కురిపించాడు.

పుష్పరాజ్‌కు ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ ప్రశంసలు
సినీ సెలబ్రిటీలు సైతం తమలో ఒకరికి అవార్డు వరించిందని సంతోషంతో ఉప్పొంగిపోయారు. బన్నీకి ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. ఆర్‌ఆర్‌ఆర్‌ డైరెక్టర్‌ రాజమౌళి 'పుష్ప.. తగ్గేదేలే' అంటూ సినిమా స్టైల్‌లో కంగ్రాట్స్‌ చెప్పాడు. దీనికి బన్నీ థాంక్యూ అని రిప్లై ఇచ్చాడు. అటు ఎన్టీఆర్‌ అయితే 'నీకు ఈ అవార్డులు, విజయం వచ్చి తీరాల్సిందే' అని ట్వీట్‌ చేశాడు. దీనికి బన్నీ 'హృదయపూర్వకంగా(జెన్యూన్‌గా) శుభాకాంక్షలు చెప్పినందుకు థ్యాంక్స్‌ బావా' అంటూ రిప్లై ఇచ్చాడు. ఆర్‌ఆర్‌ఆర్‌లోని మరో హీరో రామ్‌చరణ్‌ మాత్రం ఒకరోజు ఆలస్యంగా విషెస్‌ చెప్పాడు.

స్పెషల్‌ నోట్‌
'పుష్ప టీమ్‌కు డబుల్‌ చీర్స్‌.. నా సోదరుడు అల్లు అర్జున్‌, దేవిశ్రీప్రసాద్‌కు కంగ్రాచ్యులేషన్స్‌' అంటూ ట్విటర్‌లో నోట్‌ రిలీజ్‌ చేశాడు. ఇందులో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకుగానూ అవార్డులు అందుకున్న ఆరుగురితో పాటు ఉప్పెన యూనిట్‌ను, ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న ఆలియా భట్‌ను ప్రత్యేకంగా అభినందించాడు. భారతీయ సినిమా మరింత గర్వపడేలా చేసిన విజేతలందరికీ కృతజ్ఞతలు అని రాసుకొచ్చాడు.

చదవండి: నీ తండ్రి నిన్ను కనాలనుకోలేదు, కానీ నువ్వు పుట్టావ్‌.. లోకేశ్‌కు ఆ‍ర్జీవీ కౌంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement