
తనకు వచ్చిన అవార్డులు, తన గురించి రాసిన మ్యాగజైన్లు.. ఇలా అన్నింటినీ ఇంటి కింద ఉన్న ఆఫీసులో మాత్రమే ఉంచేవాడు. ఇంట్లోకి దేన్నీ తీసుకొచ్చేవాడు కాదు. ఒక్క అ
కొడుకు ఎంత ఎత్తుకు ఎదిగితే తండ్రికి అంత ఆనందం. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి అదే ఆనందంలో ఉన్నాడు. ఆర్‌ఆర్‌ఆర్‌లో రామ్‌చరణ్ నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తుండటంతో పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. ప్రస్తుతం చరణ్ అమెరికాలో వరుస ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో టాక్ ఈజీ పాడ్‌క్యాస్ట్‌లో హోస్ట్ సామ్ ఫ్రాగోసోతో మాట్లాడుతూ తన తండ్రి గొప్పతనాన్ని గురించి చెప్పుకొచ్చాడు.
'మాకంటూ సొంత గుర్తింపు ఉండాలనే నాన్న తపనపడ్డాడు. ఆయనెప్పుడూ స్టార్‌డమ్‌ను తలకెక్కించుకోలేదు. దాన్ని మా దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. తనకు వచ్చిన అవార్డులు, తన గురించి రాసిన మ్యాగజైన్లు.. ఇలా అన్నింటినీ ఇంటి కింద ఉన్న ఆఫీసులో మాత్రమే ఉంచేవాడు. ఇంట్లోకి దేన్నీ తీసుకొచ్చేవాడు కాదు. ఒక్క అవార్డును కూడా ఇంట్లో పెట్టుకోలేదు. తనో గొప్ప స్టార్ అని మేము గర్వపడకూడదనుకున్నారు.
మమ్మల్ని ఒక స్టార్ చిల్డ్రన్స్‌గా కాకుండా సాధారణ పిల్లలుగానే పెంచాడు. ఇండస్ట్రీలో పెద్ద హీరో అని మాకు తెలియజేసేందుకు ఇష్టపడలేదు. ఆయన ద్వారా ఇండస్ట్రీలోకి సులభంగా అడుగుపెట్టొచ్చన్న భావనను మాకు ఎన్నడూ కలగనీయలేదు. ఆయన ఏదైతే చేశారో అదంతా మా మంచి కోసమే! ఆయన పెంపకం వల్లే నేనిలా ఉన్నాను. ఇప్పటికీ నా ఈఎమ్‌ఐలు నేను సవ్యంగా కట్టుకోగలుగుతున్నాను' అని చెప్పుకొచ్చాడు.