
టాలీవుడ్‌పై ఫోకస్ తగ్గించిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌లో పాగా వేశారు. హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా బీటౌన్‌లో వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇప్పటికే హిందీలో యారియాన్, అయ్యారే, దేదే ప్యార్ దే వంటి మూడు సినిమాల్లో నటించినప్పటికీ ఏదీ కూడా రకుల్‌కు బ్లాక్ బస్టర్ హిట్‌ను అందించలేకపోయాయి. అయినప్పటికీ మరో రెండు బాలీవుడ్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘మే డే’లో రకుల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే విధంగా అజయ్ దేవగన్ ‘థాంక్ గాడ్’ లోనూ ఈ మద్దుగుమ్మ నటిస్తున్నారు. చదవండి: రకుల్ ఫిట్‌నెస్ మంత్రా : ఫ్యాన్స్ ఫిదా
తాజాగా బాలీవుడ్ యువ నటుడు ఆయుష్మాన్ ఖురానాతో కలిసి రకుల్ ప్రీత్ సింగ్ జోడి కట్టనున్నారు. వీరిద్దరి కలయికలో రూపొందుతున్న చిత్రం ‘డాక్టర్ జీ’. కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆయుష్మాన్ డాక్టర్ ఉదయ్ పాత్రలో కనిపించనుండగా.. ఆయన సీనియర్‌గా రకుల్ డాక్టర్ ఫాతిమా పాత్ర పోషించనున్నారు. ఈ సినిమాను అనుభూతి కశ్యప్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక డాక్టర్ జీ సినిమాపై రకుల్ స్పందించారు. సినిమాలో భాగమవుతున్నందుకు చాలా అసక్తిగా ఉందని తెలిపారు. షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు.
Yayyyyy!!! Soooo excited!! Can’t wait to start shooting 😁😁 https://t.co/Aho0jzznyt
— Rakul Singh (@Rakulpreet) February 1, 2021