బాహుబలి ఎపిక్‌లో కొత్త సీన్‌.. అదిరిపోయిందయ్యా! | Baahubali: The Epic Movie Returns to Theaters with New Scenes and Goosebump Moments | Sakshi
Sakshi News home page

బిజ్జల దేవ డైలాగ్స్‌తో బాహుబలికి ఎలివేషన్‌.. సీన్‌ అదిరిపోయిందయ్యా!

Oct 31 2025 11:22 AM | Updated on Oct 31 2025 12:23 PM

Rajamouli Added New Scene in Baahubali The Epic Movie

రాజమౌళి సృష్టించిన కళాఖండం బాహుబలి (Baahubali Movie) వచ్చి పదేళ్లవుతోంది. ఇప్పటికీ దాని క్రేజ్‌ అలాగే ఉంది. సినిమా ఇండస్ట్రీ చరిత్రలో సువర్ణాక్షరాలతో తన పేరు లిఖించుకున్న బాహుబలి మరోసారి థియేటర్లలో సందడి చేస్తోంది. బాహుబలి రెండు భాగాలను కలిసి 'బాహుబలి: ది ఎపిక్‌ మూవీ' (Baahubali The Epic Movie)గా శుక్రవారం (అక్టోబర్‌ 31) రిలీజ్‌ చేశారు. ఇందులో కొన్ని సీన్లను, పాటల్ని ఎత్తేస్తే.. రెండు భాగాల్లోనూ చూడని కొన్ని కొత్త సీన్లను యాడ్‌ చేశారు.

చచ్చినవాడు ఎలా వస్తాడు?
అందులో మహేంద్ర బాహుబలి.. మాహిష్మతి రాజ్యంలో అడుగుపెట్టే సీన్‌ అద్భుతంగా ఉంది. అతడు చనిపోయాడంటూ బిజ్జలదేవ (నాజర్‌) చెప్పే డైలాగ్‌.. మీ అంతు చూడటానికి మళ్లీ వస్తున్నానంటూ బాహుబలి వచ్చే తీరు అదిరిపోయింది. ఆ సీన్‌లో ఏముందంటే.. బాహుబలి చేతిలో నుంచి తప్పించుకున్న ఓ సైనికుడు రాజ్యానికి వచ్చి.. బాహుబలి బతికే ఉన్నాడంటూ బిజ్జలదేవకి చెబుతాడు. చచ్చినవాడు ఎలా వస్తాడు? 

గూస్‌బంప్స్‌ తెప్పించే సీన్‌
వాడి రక్తం కారికారి భూమిలోకి ఇంకిపోయింది, వాడి శరీరం మంటల్లో కాలి కాలి బూడిదైపోయింది.. వాడి ప్రాణం ప్రాణహిత నది ప్రవాహంలో కొట్టుకుపోయింది.. కాలిన బూడిద గాలిలో చెల్లాచెదురైపోయింది. వాడి ఆయువు అనంతవిశ్వంలో ఆవిరైపోయింది అంటూ పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో బాహుబలి రాజ్యంలో అడుగుపెడతాడు. మాహిష్మతి ఊపిరి పీల్చుకో అని దేవసేన చెప్పే డైలాగ్‌తో ఈ సీన్‌ నెక్స్ట్‌ లెవల్‌కు వెళ్తుంది. థియేటర్‌లో ఈ సీన్‌ చూసేవారి రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం! ఇంత మంచి సీన్‌ ఎలా వదిలేశారంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సినిమా
ప్రభాస్‌ హీరోగా నటించిన బాహుబలి రెండు భాగాలుగా వచ్చింది. మొదటి భాగం 2015లో రిలీజవగా రెండో భాగం 2017లో విడుదలైంది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్‌ చేశాయి. అనుష్క శెట్టి, రమ్య కృష్ణ, తమన్నా, సత్యరాజ్‌, నాజర్‌ కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం అందించాడు. శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మించారు. ఈ రెండు భాగాల సమ్మేళనమే బాహుబలి: ది ఎపిక్‌. అయితే ఇందులో కిచ్చా సుదీప్‌తో పాటు కొన్ని సీన్లను, పాటలను తొలగించారు. అయినప్పటికీ 3.45 గంటల నిడివితో బాహుబలి ఎపిక్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 

 

చదవండి: ‘బాహుబలి: ది ఎపిక్‌’ మూవీ రివ్యూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement