టాలీవుడ్‌ అప్‌డేట్స్‌.. ఏ హీరో ఎక్కడున్నాడో తెలుసా? | Raaka, Peddi, Fauzi, Tollywood Movies Shooting Updates | Sakshi
Sakshi News home page

రాకా, పౌజీ, ప్యారడైజ్‌, పెద్ది.. షూటింగ్‌ ఎక్కడ జరుగుతోందో తెలుసా?

Apr 27 2026 11:21 AM | Updated on Apr 27 2026 11:44 AM

Raaka, Peddi, Fauzi, Tollywood Movies Shooting Updates

టాలీవుడ్‌ నుంచి ఇప్పుడు వరుస పాన్‌ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. ప్రభాస్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ లాంటి స్టార్‌ హీరోలంతా ఇప్పుడు షూటింగ్‌లో బిజీ అయిపోయారు. వీరితో పాటు సీనియర్‌ హీరోలు నాగార్జున, బాలకృష్ణ, వెంకటెశ్‌ కూడా సమ్మర్‌లోనూ సెట్స్‌లోనే ఉంటున్నారు. మరి ఏ హీరో ఎక్కడ ఉన్నాడు? కొత్త సినిమాల షూటింగ్‌ ఎక్కడెక్కడ జరుగుతుంది? ఓ లుక్కేయండి.

🎥 ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది

🎥 అల్లు అర్జున్ అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న రాకా మూవీ  షూటింగ్ ముంబై లో జరుగుతుంది. ప్రస్తుతం బన్నీ ముంబైలోనే ఉన్నాడు.

🎥 ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. అక్కడ వేసిన ఓ సెట్‌లో కీలకమైన సన్నివేశలు షూట్‌ చేస్తున్నారు.

🎥 రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా షూటింగ్ వన్ స్టూడియో శంకరపల్లి లో జరుగుతోంది. అక్కడే ఓ సెట్‌లో ఐటమ్‌ సాంగ్‌ షూట్‌ చేస్తున్నారు.

🎥 నందమూరి బాలకృష్ణ మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ జన్వాడ గుంటూరు కారం సెట్ లో జరుగుతోంది.

🎥 కార్తీక్ డైరెక్షన్‌లో నాగార్జున హీరోగా కెక్కుతున్న సినిమా షూటింగ్  ఎల్బీ నగర్ లో జరుగుతుంది. నాగార్జున కెరీర్‌లో 100వ సినిమా ఇది.

🎥 వెంకటేష్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్ లో జరుగుతోంది.

🎥 నాని శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతున్న  ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ ముచ్చింతల్ లో జరుగుతుంది.

🎥 విజయ్ దేవరకొండ రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో నటిస్తున్న రణబాలి సినిమా షూటింగ్ గండిపేట సెట్ లో జరుగుతుంది.

🎥 రవితేజ శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కుతున్న ఇరుముడి సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది.

🎥 శర్వానంద్ సంపత్ నంది కాంబోలో తెరకెక్కుతున్న భోగి సినిమా షూటింగ్ ముచ్చింతల్ లో జరుగుతోంది.

🎥 రష్మిక , రవీంద్ర పుల్లే డైరెక్షన్ లో నటిస్తున్న మైసా సినిమా షూటింగ్ కేరళ లో జరుగుతోంది.

🎥 శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ శంకర పల్లి లో జరుగుతుంది.

🎥 గోపీచంద్ సంకల్ప్ రెడ్డి కాంబోలో తెరకెక్కుతున్న భరతవర్ష సినిమా షూటింగ్ అజీజ్ నగర్ లో జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement