విషాదం: రోడ్డు ప్రమాదంలో యువ గాయకుడు మృతి | Punjabi Singer Diljaan Dies In Car Accident Near Amritsar On Tuesday | Sakshi
Sakshi News home page

విషాదం: రోడ్డు ప్రమాదంలో పంజాబీ గాయకుడు మృతి

Mar 30 2021 12:29 PM | Updated on Mar 30 2021 2:45 PM

Punjabi Singer Diljaan Dies In Car Accident Near Amritsar On Tuesday - Sakshi

రోడ్డు ప్రమాదం ఓ గాయకుడి బంగారు భవిష్యత్తును చిదిమేసింది. ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. పంజాబ్‌కు చెందిన సింగర్‌ దిల్‌జాన్‌ మంగళవారం కర్తార్‌పూర్‌ నుంచి అమృత్‌సర్‌ వెళుతున్నాడు. మార్గమధ్యలో జండియాల గురు ప్రాంతంలో దిల్‌జాన్‌ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆగి ఉన్న ట్రక్కును కారు బలంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దిల్జాన్‌ను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.  

అయితే ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నారు. మరోవైపు దిల్జాన్‌ మరణం పట్ల పంజాబ్‌ మ్యూజిక్‌ ఇండస్ట్రీ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. అనేక మంది సెలబ్రిటీలు సోషల్‌ మీడియా ద్వారా తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. కాగా కార్తర్‌పూర్‌ ప్రాంతానికి చెందిన దిల్జాన్‌కు భార్య, పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వారు కెనడాలో నివసిస్తున్నారు.

చదవండి: బేబీ బంప్‌తో ఫోటోలకు పోజిచ్చిన శ్రేయా ఘోషల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement