'పెద్ది' ఆపితే ఆమరణ నిరహార దీక్ష చేస్తా | Producer Natti Kumar Reacts Peddi Movie Hurdels | Sakshi
Sakshi News home page

Peddi: మరింత ముదురుతునన్న 'పెద్ది' వివాదం

May 23 2026 8:48 PM | Updated on May 23 2026 8:48 PM

Producer Natti Kumar Reacts Peddi Movie Hurdels

రామ్ చరణ్ 'పెద్ది' సినిమా జూన్ 4న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆంధ్రాలో విడుదల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ తెలంగాణలోని థియేటర్లలోకి వస్తుందా అనే సందేహం మాత్రం నెలకొంది. దానికి కారణం పర్సంటేజీ వివాదం. కొన్నిరోజుల ముందు అంతా సద్దుమణిగింది అనుకుంటే.. తెలంగాణ ఎగ్జిబిటర్లు శనివారం తెలుగు ఫిలిం ఛాంబర్‌లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'పెద్ది'కి పర్సంటేజీ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. ఇదలా ఉండగానే నిర్మాత నట్టికుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

(ఇదీ చదవండి: మళ్లీ మొదటకొచ్చిన 'పెద్ది' సమస్య.. ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం)

'మీరు పెద్ది సినిమాని ఇదే ప్రకారం ఆపాలని నిర్ణయించుకుంటే బుధవారం(మే 27) ఉదయం 10 గంటల నుంచి తెలుగు ఫిలిం ఛాంబర్‌లో ఆమరణ నిరహార దీక్షకు దిగుతా. మీరు చిరంజీవి కుటుంబాన్ని టార్గెట్ చేయట్లేదు అంటూనే అదే చేస్తున్నారు. చేస్తున్న వాళ్లు ఎవరో మాకు బాగా తెలుసు. మీ వెనకాల కొంతమంది ఆడిస్తున్నారు. ఆ ఆటకు బలికావద్దు' అని నట్టికుమార్ ఆవేశపడిపోయారు.

ఇదంతా చూస్తుంటే తెలంగాణలో 'పెద్ది' రిలీజ్ అవుతుందా అనిపిస్తుంది. శనివారం జరిగిన ఇదే ప్రెస్‌మీట్‌లో ఎగ్జిబిటర్లు మాట్లాడుతూ.. తెలంగాణలో టికెట్ రేట్లు పెంచే అవకాశం లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లెటర్ కూడా రాసినట్లు చెప్పుకొచ్చారు. మరి ఈ అడ్డంకులు దాటుకుని మూవీ రిలీజ్ అవుతుందా లేదా అనేది చూడాలి?

స్పోర్ట్స్ డ్రామాగా తీసిన ఈ సినిమాలో చరణ్.. రన్నర్, క్రికెటర్, కుస్తీ వీరుడిగా కనిపించబోతున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా శివరాజ్ కుమార్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీమందించాడు. బుచ్చిబాబు దర్శకుడు.

(ఇదీ చదవండి: లావుగా ఉన్నా.. జనాలు చూస్తారా అని తారక్ అడిగాడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement