
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం కింగ్‌డమ్ (Kingdom Movie). గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ మూవీ జూలై 31న విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు నిర్మాత నాగవంశీ. తాజాగా ఆయన తన కెరీర్‌లో చేసిన తప్పుల గురించి ఓపెన్ అయ్యాడు.
వద్దన్నా వినలేదు
నాగవంశీ (Naga Vamsi) మాట్లాడుతూ.. లక్కీ భాస్కర్ మూవీకి నేను అనుకున్నంత వసూళ్లు రాలేదు. మరోవైపు గుంటూరు కారం సినిమాకు అంత ట్రోలింగ్ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. తెలిసి తెలిసీ తప్పు చేసిన మూవీ రణరంగం. అప్పటికీ మా బాబాయ్.. శర్వానంద్ చిన్నపిల్లాడిలా ఉంటాడు, అందులోనూ లవర్ బాయ్ ఇమేజ్ ఉంది. ఇలాంటి సమయంలో ఏజ్‌డ్ క్యారెక్టర్‌తో సాహసం చేయడం అవసరమా? అన్నాడు.
అదే నేను చేసిన తప్పు
కానీ, నేను, సుధీర్.. కొత్తగా ఉంటుందేమో అని ప్రయత్నించాం. అస్సలు వర్కవుట్ కాలేదు. ఈ సినిమా తీయడం నేను చేసిన తప్పు. బహుశా రవితేజలాంటివాళ్లు చేసుంటే సినిమా హిట్టయ్యేదేమో! ఆదికేశవ కూడా అంతే! సినిమా రిపేర్ చేసేందుకు ప్రయత్నించాం, కానీ సెట్టవలేదు. ఈ రెండు సినిమాలు నా కెరీర్‌లో కాస్ట్లీ మిస్టేక్స్ అని చెప్పుకొచ్చాడు.
సినిమా
రణరంగం సినిమాలో శర్వానంద్ హీరోగా, కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించారు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2019 ఆగస్టు 15న రిలీజైంది. ఈ గ్యాంగ్‌స్టర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఆదికేశవ విషయానికి వస్తే.. పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించారు. 2023లో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అపజయాన్ని మూటగట్టుకుంది.
చదవండి: చేతులతో పాముని పట్టుకున్న సోనూ సూద్.. వీడియో వైరల్