
పవన్ కల్యాణ్ ఓ సైకోలా వ్యవహరిస్తున్నారంటూ సినీ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళీ మండిపడ్డారు.రిపబ్లిక్ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పోసాని స్పందిస్తూ సోమవారం మీడియా ముందుకు వచ్చారు. ఆయన వ్యాఖ్యలను తప్పుబడుతూ పోసాని విమర్శ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పవన్ ఫ్యాన్స్ తనని టార్గెట్ చేసి బెదిరింపులు దిగారని ఆరోపిస్తూ ఆయన మరోసారి మీడియా ముందుకు వచ్చారు.
మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌కబ్‌లో నిర్వహించిన ప్రస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘పవన్ ఫ్యాన్స్‌తో గ్రూపులు పెట్టుకున్నారు. ఫంక్షన్లలో నీ గ్రూపులతో పవన్.. పవన్ అని నినాదాలు చేయించుకుంటావు. ఇలాంటి చిల్లర బెదిరింపులకు నేను భయపడను. నన్ను ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటా. నీకు నీ కటుంబం ఎంత గొప్పో.. నాకు నా కుటుంబ కూడా అంతే గొప్పా. విమర్శలు తట్టుకోలేని వాడివి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావు. ఒక్క విషయం గుర్తు పెట్టుకో నువ్వు ఎంత తిట్టినా నేను డిమోరలైజ్ కాను. ఒకే నన్ను చంపిస్తావా.. నేను రెడీ. నా డెడ్ బాడీ కూడా నిన్ను వదలదు’ అంటూ పోసాని ధ్వజమెత్తారు.