'పెద్ది' టికెట్ ధరలు ఎంతెంత పెంచారంటే? | Peddi Movie Ticket Hike Andhra Pradesh | Sakshi
Sakshi News home page

Peddi Movie: ఆంధ్రాలో వచ్చేసింది.. మరి తెలంగాణలో?

May 29 2026 8:58 AM | Updated on May 29 2026 9:17 AM

Peddi Movie Ticket Hike Andhra Pradesh

రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' విడుదలకు సిద్ధమైంది. వచ్చే గురవారమే (జూన్ 04) థియేటర్లలోకి రానుంది. ముందురోజు రాత్రి ప్రీమియర్లు వేయనున్నారు. ఈ క్రమంలోనే సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రం.. ఇప్పుడు టికెట్ ధరల పెంపుపై కూడా జీవో తెచ్చుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతిచ్చింది.

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లో 16 సినిమాలు స్ట్రీమింగ్)

జూన్ 3న రాత్రి 8 గంటలకు వేసే ప్రీమియర్ షోలకు ఒక్కో టికెట్ రూ.600 (జీఎస్టీతో కలిపి).. అలానే 4వ తేదీ నుంచి 10 రోజుల పాటు ప్రస్తుతమున్న టికెట్ ధరలపై సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీప్లెక్స్‌ల్లో రూ.125 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. వీటితో పాటు రోజుకు ఐదు షోలు ప్రదర్శించేందుకు వీలు కల్పిస్తూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులిచ్చారు.

స్పోర్ట్స్ డ్రామాగా తీస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్.. రన్నర్, రెజ్లర్, క్రికెటర్‌గా కనిపించబోతున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. ఇప్పటికే నాలుగు పాటలు, ట్రైలర్ రిలీజ్ చేశారు. బుచ్చిబాబు దర్శకుడు.

ఆంధ్రాలో టికెట్ రేట్ల పెంపుపై ఉత్తర్వులు తెచ్చుకున్నారు. కానీ తెలంగాణలోనూ వస్తాయా అనేది చూడాలి? ఎందుకంటే మొన్నటివరకు ఈ సినిమాకు కూడా పర్సంటేజీ ఇవ్వాల్సిందేనని ఎగ్జిబిటర్లు పట్టుబట్టుకుని కూర్చుకున్నారు. ఈ క్రమంలోనే 'పెద్ది' టికెట్ రేట్లు పెంచేది లేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ కూడా రాశామని చెప్పారు. మరి ఇప్పుడు మాట మార్చి పెంపునకు అంగీకరిస్తారా లేదా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: 'పెద్ది' నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement