‘ఈ కథలో పాత్రలు కల్పితం’ మోషన్‌ పోస్టర్‌ విడుదల | Pawan Tej Debut Movie E kathalo patralu kalpitham Motion Poster‌ | Sakshi
Sakshi News home page

‘ఈ కథలో పాత్రలు కల్పితం’ మోషన్‌ పోస్టర్‌ విడుదల

Aug 22 2020 7:53 PM | Updated on Aug 22 2020 9:00 PM

Pawan Tej Debut Movie E kathalo patralu kalpitham Motion Poster‌ - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పవన్‌ తేజ్‌ కొణిదెలను హీరోగా పరిచయం చేస్తూ మాధవి సమర్పణలో ఎంవీటీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అభిరామ్‌ ఎం. దర్శకత్వంలో రాజేష్‌ నాయుడు నిర్మిస్తున్న థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ చిత్రం 'ఈ కథలో పాత్రలు కల్పితం'. ఈ సినిమాలో మేఘన, ల‌క్కి హీరోయిన్స్‌గా చేస్తున్నారు. అయితే ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల చిత్రీకరణ పూర్తి చేరుకున్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్మాత రాజేష్‌ నాయుడు మాట్లాడుతూ... ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ షూటింగ్ పూర్తైందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని చెప్పాడు. ఆర్టిస్టులు, టెక్నిషయన్స్ నుంచి కూడా మంచి సపోర్ట్ లభిస్తోందన్నాడు. ఇప్పటి వరకు జరిగిన చిత్రీకరణ ఔట్ పుట్‌ చాలా బాగా వచ్చిందని తెలిపాడు. టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుండి తమ సినిమాకి పాజిటివ్ బజ్ క్రియేట్ అయిందని ఆనందం వ్యక్తం చేశాడు. 

ఈ సినిమా హీరో పవన్‌ తేజ్‌ కొణిదెలకి ఒక పర్ఫెక్ట్ లాంచింగ్ మూవీ అవుతుందని ఆయన పేర్కొన్నారు. దర్శకుడు అభిరామ్ మంచి విజన్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టునే థ్రిల్లింగ్ అంశాలతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని చెప్పాడు. రీసెంట్గా వచ్చిన 'జెస్సీ', ‘ఓ పిట్టకథ’ సినిమాలకు వర్క్ చేసిన సినిమాటోగ్రాఫర్‌ సునీల్‌ కుమార్‌ విజువల్స్‌, 'ఆర్‌ఎక్స్‌ 100', 'కల్కి' చిత్రాలకు డైలాగ్స్‌ రాసిన తాజుద్దీన్‌ సయ్యద్‌ మాటలు ఈ చిత్రానికి హైలెట్గా నిలవనున్నాయన్నారు. చివరి షెడ్యూల్ పూర్తి అవగానే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరిపి విడుదల తేదీని ప్రకటిస్తామని, త్వరలోనే టీజర్, పాటలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. లేటెస్ట్గా విడుదలైన థీమ్ పోస్టర్కు మంచి ఆదరణ లభిస్తోందని రాజేష్‌ తెలిపాడు.

డైరెక్టర్ అభిరామ్‌ ఎం మాట్లాడుతూ... ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని,  హీరో పవన్ తేజ్ కొణిదెలకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతోందన్నాడు. కథ, కథనాలు ఈ వినిమాకు బాగా కుదిరాయని, కార్తిక్ కొనకండ్ల అందించిన సంగీతం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుందని తను నమ్ముతున్నన్నారు. నిర్మాత రాజేష్ నాయుడు గారు సినిమాను రిచ్గా అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించారపి. త్వరలో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని అభిరాం చెప్పాడు. ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ ప్రధాన తారగణం: పవన్‌ తేజ్‌, మేఘన, ల‌క్కి; సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ: సునీల్‌ కుమార్‌.ఎన్‌ సంగీతం: కార్తీక్‌ కొడకండ్ల, ఎడిటింగ్‌: శ్రీకాంత్‌ పట్నాయక్‌ ఆర్‌; ఫైట్స్‌: షావోలిన్‌ మల్లేష్‌; ఆర్ట్‌: నరేష్‌ బాబు తిమ్మిరి; మాటలు: తాజుద్దీన్‌ సయ్యద్‌; కాస్ట్యూమ్‌ డిజైనర్‌: సియ డిజైన‌ర్స్‌; కో-డైరెక్టర్‌: కె. శ్రీనివాస్‌ రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కృష్ణ పామర్తి లైన్;‌ ప్రొడ్యూసర్‌: దుర్గా అనీల్‌ రెడ్డి. నిర్మాత: రాజేష్‌ నాయుడు, రచన, దర్శకత్వం: అభిరామ్‌ ఎం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement