జర్నలిజం బ్యాక్‌గ్రౌండ్‌తోనే సినిమాలోకి వచ్చా : దర్శకుడు

Padma Sri Movie Trailer Launch By Journalist At Film Chamber - Sakshi

పద్మశ్రీ ట్రైలర్ విడుదల

సాక్షి, హైదరాబాద్‌ : ఎస్.ఎస్. పట్నాయక్ దర్శకత్వం వహించిన పద్మశ్రీ సినిమా విడుదలయ్యింది. ఫిలింఛాంబర్లో ప్రముఖ పాత్రికేయులు చేతులమీదుగా ట్రైలర్‌ను లాంఛ్‌ చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఎస్.ఎస్. పట్నాయక్ మాట్లాడుతూ ఈ రోజు తన జన్మదినం అని, ఈ జన్మదిన వేడుకను ఇలా ట్రైలర్ లాంచ్ ద్వారా పాత్రికేయులు నడుమ ఫిలింఛాంబర్లో జరుపుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు.  తను కూడా జర్నలిజం బ్యాక్ గ్రౌండ్తో వచ్చిన వ్యక్తిని కాబట్టి జర్నలిస్ట్ కష్టనష్టాలు సాధకబాధకాలు తనకు తెలుసు కాబట్టి తన  పుట్టిన రోజు నాడు  జర్నలిస్టుల చేతుల మీదుగా చిత్ర ట్రైలర్ ని విడుదల చేయడంఒక గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

 ఈ చిత్రంలో హీరోగా పరిచయమైన కిషోర్ కుమార్, హీరోయిన్ సంధ్యారాణి మాట్లాడుతూ... ఈ చిత్రం ఒక కొత్త ప్రయోగాత్మక చిత్రం అని ఈ చిత్రం విడుదల తర్వాత వారికి మరెన్నో అవకాశాలు వస్తాయని తన ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. ఈ చిత్ర సహనిర్మాత కొత్తకోట బాలకృష్ణ మాట్లాడుతూ అంతా కొత్త వారైనా నటీనటులతో ఇంత చక్కగా దర్శకుడు చేయించడం దర్శకునికి చిన్ననాటి స్నేహితులు గా తను ఎంతో గర్వపడుతున్నానని తన  ఆనందాన్ని, ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనే ఆశాభావాన్ని  వ్యక్తపరిచారు.

అయితే ఈ కార్యక్రమాన్ని మొదటిగా స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమంతో పద్మశ్రీ టీం ప్రారంభించింది. అయితే సినిమా మనిషికి ఎంత ఆనందాన్ని ఇస్తుందో అదే విధంగా మనలో ఉండే శుభ్రత పరిసరాల శుభ్రత అనేది ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని కరోనా బారి నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అని నేపథ్యంలో కరోనా కి భయపడొద్దు జాగ్రత్తపడండి అంటూ పద్మశ్రీ టీం ఫిలిం నగర్ ఫిలిం ఛాంబర్ దగ్గర నుండి స్వచ్ఛభారత్ ని కొనసాగిస్తూ పరిసరాలను శుభ్రం చేసింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top