ఒక్కసారి కమిట్‌ అయితే... | Okkasari Commit Aithe Movie Launch | Sakshi
Sakshi News home page

ఒక్కసారి కమిట్‌ అయితే...

Oct 12 2020 5:45 AM | Updated on Oct 17 2021 1:50 PM

Okkasari Commit Aithe Movie Launch - Sakshi

కల్యాణ్‌ గల్లెల, మౌనికారాజ్‌

కల్యాణ్‌ గల్లెల, మౌనికారాజ్‌ జంటగా రూపొందుతున్న చిత్రం ‘ఒక్కసారి కమిట్‌ అయితే’. రవి ములకలపల్లి దర్శకత్వంలో వసుంధర క్రియేషన్స్, నటరాజ శ్రీనివాస క్రియేషన్స్‌ పతాకాలపై పి. శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత తుమ్మల ప్రసన్నకుమార్‌ క్లాప్‌నివ్వగా, సాయివెంకట్‌ కెమెరా స్విచాన్‌ చేయగా, దర్శకుడు ప్రేమ్‌రాజ్‌ ఫస్ట్‌ షాట్‌కు దర్శకత్వం వహించారు. దర్శకుడు రవి మాట్లాడుతూ– ‘‘లవ్‌ అండ్‌ యాక్షన్‌ సెంటిమెంట్‌ ఎమోషనల్‌ మూవీగా యువతకు సందేశాన్ని ఇచ్చే ఉద్దేశంతో ఈ సినిమాను తీస్తున్నాం. ఈ చిత్రంలో నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు ఉంటాయి’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్, వైజాగ్, కోనసీమ, కర్నూల్‌ తదితర ప్రాంతాలలో మూడు షెడ్యూల్స్‌లో సినిమాను పూర్తి చేస్తాం’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement