ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న హీరోయిన్‌.. ఎట్టకేలకు క్షేమంగా.. | Nushrratt Bharuccha Returns to Mumbai After Being Stuck in Israel | Sakshi
Sakshi News home page

Nushrratt Bharuccha: ఇజ్రాయెల్‌లో యుద్ధం.. ఎట్టకేలకు క్షేమంగా వచ్చిన హీరోయిన్‌!

Oct 8 2023 4:51 PM | Updated on Oct 8 2023 5:19 PM

Nushrratt Bharuccha Returns to Mumbai After Being Stuck in Israel - Sakshi

తర్వాత నుస్రత్‌ తిరిగి తన టీమ్‌తో టచ్‌లోకి వచ్చినట్లు తెలిసింది. మొత్తానికి అన్ని అడ్డంకులను అధిగమించి నుస్రత్‌ ఆదివారం నాడు(అక్టోబర్‌ 8న) సురక్షితంగా ముంబైకి వచ్చేసింది.

ఇజ్రాయెల్‌ దేశంలో చిక్కుకున్న బాలీవుడ్‌ హీరోయిన్‌ నుస్రత్‌ బరూచా క్షేమంగా భారత్‌కు తిరిగి వచ్చింది. హైఫా ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ కోసం ఇజ్రాయెల్‌ వెళ్లిన ఆమె అకస్మాత్తుగా మొదలైన యుద్ధం కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అక్కడ భీకర యుద్ధం కొనసాగుతున్న క్రమంలో టీమ్‌తో తనకు కమ్యూనికేషన్‌ సంబంధాలు కూడా తెగిపోయినట్లు తొలుత ప్రచారం జరిగింది.

క్షేమంగా భారత్‌కు
తర్వాత నుస్రత్‌ తిరిగి తన టీమ్‌తో టచ్‌లోకి వచ్చినట్లు తెలిసింది. మొత్తానికి అన్ని అడ్డంకులను అధిగమించి నుస్రత్‌ ఆదివారం నాడు(అక్టోబర్‌ 8న) సురక్షితంగా ముంబైకి వచ్చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడున్న పాత్రికేయులు తనను మాట్లాడించేందుకు ప్రయత్నించగా ఇప్పుడేం మాట్లాడలేనని, తనకు కాస్త సమయం కావాలని కోరింది. కాగా నుస్రత్‌ 2010లో తెలుగులో ‘తాజ్‌ మహాల్‌’ అనే చిత్రంలో కనిపించింది. ఇటీవల హిందీ ఛత్రపతి మూవీలో హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం చోరీ 2 మూవీ చేస్తోంది.

ఇజ్రాయెల్‌పై దాడి
పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ల దాడులతో ఇజ్రాయెల్‌ అట్టుడికిపోతోంది. హమాస్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైతం యుద్ధానికి దిగింది. దీంతో పాలస్తీనా- ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటికే వందలమంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్‌కు మద్దతుగా తాజాగా లెబనాన్‌లోని మిలిటెంట్‌ సంస్థ ‘హెజ్బొల్లా’ కూడా యుద్ధంలోకి దిగింది. 

చదవండి: ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న ప్రముఖ నటి..!
తాళి కడితే తీసి పారేశారు.. కుళ్ల బొడిచి గెంటేశారు.. సీనియర్‌ నటుడు రాజ్‌ కుమార్‌ లవ్‌స్టోరీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement