డూప్‌ లేని యాక్షన్‌ | No Stunt Double for Mahesh Babu: Actor to Perform Own Stunts in SS Rajamouli Film | Sakshi
Sakshi News home page

డూప్‌ లేని యాక్షన్‌

Jul 17 2025 1:55 AM | Updated on Jul 17 2025 1:55 AM

 No Stunt Double for Mahesh Babu: Actor to Perform Own Stunts in SS Rajamouli Film

హీరో మహేశ్‌బాబు–దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఫారెస్ట్‌ అడ్వెంచరస్‌ యాక్షన్‌ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల హైదరాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ను కెన్యాలో ప్లాన్‌ చేశారట రాజమౌళి. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం నెక్ట్స్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ సౌతాఫ్రికాలో జరగనుందని సమాచారం.

అక్కడ కీలకమైన టాకీపార్ట్, ఓ సాంగ్, ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్‌ను ప్లాన్‌ చేశారట. ఈ షెడ్యూల్‌కు సంబంధించిన షూటింగ్‌ రిహార్సల్స్‌తో ప్రస్తుతం యూనిట్‌ బిజీగా ఉందని తెలిసింది. అంతేకాదు... ఈ సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాలను మహేశ్‌బాబు ఎటువంటి డూప్‌ లేకుండా చేస్తున్నారని, దీంతో యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో యూనిట్‌ తగిన జాగ్రత్తలుపాటిస్తోందని ఫిల్మ్‌నగర్‌ భోగట్టా. కేఎల్‌ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్‌ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. మరో కీలకపాత్రలో మాధవన్‌ నటిస్తారనే టాక్‌ తెరపైకి వచ్చింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement