
కొత్త పెళ్లికూతురు నిహారిక నటిస్తోన్న వెబ్ సిరీస్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభం అయ్యింది. రాయుడు చిత్రాలు బ్యానర్‌పై స్వీయదర్శకత్వంలో భాను రాయుడు రూపొందిస్తున్నారు. యూ ట్యూబర్ నిఖిల్ విజయేంద్ర, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ పూజా కార్యక్రమంలో భర్త చైతన్య జొన్నలగడ్డతో కలసి నిహారిక పాల్గొన్నారు. రచయిత విజయేంద్ర ప్రసాద్, డైరెక్టర్ వీవీ వినాయక్ స్క్రిప్ట్‌ను భానురాయుడుకి అందించారు.
ఈ సందర్భంగా భాను రాయుడు మాట్లాడుతూ–‘‘డిజిటల్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిసిందే. మా కథకు ఎవరు కరెక్ట్ అని ఆలోచించి నిహారికాగారిని సంప్రదించాం. ఆమె నటించడానికి ఒప్పుకున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ‘‘ఇక వర్క్ మోడ్‌లోకి వచ్చేశాను. చాలా ఎగ్జయిటెడ్‌గా ఉన్నాను’’ అంటూ వెబ్ సిరీస్ ప్రారంభోత్సవం సందర్భంగా నిహారిక ట్వీట్ చేశారు. ఈ సిరీస్‌కి సంగీతం: కల్యాణీ మాలిక్.
Ok. Let’s get back to work! 🎥
— Niharika Konidela (@IamNiharikaK) January 8, 2021
Super excited for this one!#RayuduChitralu pic.twitter.com/8AXO6aAysn